simha vahanam
-
తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనం పై శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : సింహ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి (ఫొటోలు)
-
సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు
సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం సింహవాహనంపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్పస్వామి భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. సింహం అంటే ముందుగా నరసింహ అవతారమే సాక్షత్కరిస్తుంది. భక్తుల మదిలో వెంకటాద్రి రాజసింహం మృగరాజుపై యోగముద్రంకిత స్వరూపంతో దర్శనమిచ్చారు. కాగా ప్రపంచాన్ని గజ గజలాడిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల చరిత్రలోనే ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సింహ వాహనంపై శ్రీగోవిందరాజస్వామివారు
-
తిరుమల: సింహ వాహనంపై స్వామివారు
-
మృగరాజుపై యోగలక్ష్మి
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై యోగలక్ష్మిగా అమ్మవారు భక్తులను కటాక్షించా రు. వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో దివ్యా లంకృతులైన అమ్మవారు యోగ ముద్రలో ఉన్న లక్ష్మీ దేవిగా సింహవాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు. ఉద యం ఉట్టి కొట్టేందుకు నిచ్చెన అధిరో హిస్తున్న కృష్ణుడిలా ముత్యపుపందిరి వా హనంపై అమ్మవారు భక్తులను దీవించా రు. జియర్స్వాముల ప్రబంధ పారాయ ణం, వేద పారాయణం, కళా బృందాల ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం ఉదయం ముత్యపు పందిరిపై అలిమేలుమంగమ్మ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా వేకువజాము రెండు గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. నాలుగు గంటలకు మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి ని వాహన మండపానికి వేంచేపు చేశారు. పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో ఉట్టి కొట్టేందుకు నిచ్చెన అధిరోహిస్తున్న కృష్ణుడిలా అమ్మవారిని అలంకరించి ముత్యపుపందిరి వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, వేద, ప్రబంధ పారాయణం, భజన బృందాల ప్రదర్శనల నడుమ తిరువీధుల్లో ఊరేగింపు వైభవంగా జరిగింది. మధ్యాహ్నం వేడుకగా స్నపన తిరుమంజనం, సాయంత్రం 6గంటలకు ఆస్థానమండపంలో ఊంజల్‌సేవ నేత్రపర్వంగా జరిగింది. రాత్రి సింహవాహనంపై అమ్మవారు భక్తులను దీవించారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని యోగ నారాయణుడిగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. రాత్రి 8–30గంటలకు అమ్మవారు సింహవాహనంపై తిరువీధుల్లో విహరించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, జేఈఓ పోల భాస్కర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీవీఎస్ఓ ఆకె.రవికృష్ణ, అదనపు సీవీఎస్ఓ శివకుమార్‌రెడ్డి, ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఓ పి.మునిరత్నంరెడ్డి, పేష్కార్ రాధాకృష్ణ, వీజీఓ అశోక్‌కుమార్ గౌడ్, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఏవీఎస్ఓ పార్థసార«థి తదితరులు పాల్గొన్నారు. నేటి వాహనసేవలు తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన శనివారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై అమ్మవారు తిరువీధుల్లో విహరి స్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్ సేవ జరుగుతుంది. -
సింహవాహనంపై శ్రీనివాసుడు
-
నేడు సింహ వాహనంపై ఊరేగింపు
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కదిరి తిరువీధుల్లో సింహవాహనంపై తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. మనుషుల్లో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటి చెప్పడానికే స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. యాగశాల ప్రవేశం, నిత్యహోమాలతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మండపోత్సవం నిర్వహిస్తారు. యాగశాలలో ఉదయం పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరిస్తారు. ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన నిరంజన్, కదిరి పట్టణానికి చెందిన లక్ష్మీదేవమ్మ, రుక్మిణమ్మ, మాడిశెట్టి నరసయ్య కుటుంబీకులు వ్యవహరిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు. -
సింహ వాహనంపై కొండమీదరాయుడు స్వామి ఊరేగింపు
బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కొండమీదరాయుడుస్వామిని సింహవాహనంపై ఊరేగించారు. ఆలయ అర్చకులు శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజల నిర్వహించారు. అదే విధంగా సోమవారం రాత్రి 8 గంటలకు కొండమీదరాయుడిని శేష వాహనంపై ఊరేగిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. -
సింహవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : బ్రహ్మోత్సవాలలో మూడవరోజు సోమవారం ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు ఈ అవతారంలో లోకానికి చాటుతారు. అలాగే నేటి రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. .ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో భక్తులు కిటకిటలాడారు. -
కన్నులపండువగా తిరుమల బ్రహ్మొత్సవాలు