సిబ్బందిని దృష్టిలో ఉంచుకొనే పోలింగ్ తేదీలు:సీఈసీ
దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ కేంద్రాల్లో రేపు ఓటరు కార్డు నమోదు ప్రక్రియ చేపడుతునున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్.సంపత్ వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని శనివారం దర్శించుకున్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ప్రజల సౌకర్యంతోపాటు భద్రత సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ తేదీలు ఖరారు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్న సంపత్కు ఆలయంలో టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు శనివారం ఉదయం సంపత్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలికారు.