
వేడుకగా తిరుమంజనం
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటలకు భక్తుల దర్శనాన్ని నిలిపివేసి ఆలయ శుద్ధి ప్రారంభించారు. సుగంధద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయ ప్రాకారాలకు లేపనంగా పూశారు. ఆనందం నిలయంలోని విమాన వేంకటేశ్వరస్వామిని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ శుద్ధి చేశారు. గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారికి కొత్త పరదాలు, శ్వేతవర్ణ పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత 11 గంటల నుంచిభక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. - సాక్షి, తిరుమల