తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 91,200 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.