devotees heavy rush
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 91,200 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
వాడపల్లిలో పుష్కర స్నానానికి బారులు తీరిన భక్తులు
వాడపల్లి: కృష్ణా పుష్కరాల మూడో రోజుకే చేరుకున్నాయి. వరుస సెలవులు కావడంతో.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి జనసంద్రమైంది. కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతంగా వాడపల్లి విరాజిల్లుతుండటంతో.. ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు.