కల్పవృక్ష వాహనంపై దేవదేవుడు | Lord goes out on Kalpavriksha Vahanam | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 8 2013 10:27 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

తిరుమల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగాడు. పాల కడలి నుంచి వచ్చిన కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు ఉదయం వేళ్లల్లో స్వర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగారు. భక్తుల కోర్కెలు తీరుస్తూ మలయప్పస్వామి తిరుగాడారు. దేవదేవుణ్ని కల్పవృక్ష వాహనంపై వీక్షించిన అశేష భక్తజనం భక్తిసాగరంలో మునిగిపోయారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మరోవైపు వెంకన్న దర్శనానికి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి ఆరు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement