
'రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం'
తిరుమల పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం తిరుమలలో విలేకర్లతో మాట్లాడారు. శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమకరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అంతకుమందు తిరుమల శ్రీవారిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు స్వామీ వారి తీర్థప్రసాదాలను ఆలయంలోని పూజారులు, అధికారులు అందజేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పాలన పగ్గాలు చేపట్టి.... కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా వెంకయ్యనాయుడు తిరుమలలో శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.