
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 20వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనుంది. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయి వరకు సేవల పంపిణీ, ఆరోగ్యం, పోషణపై సమావేశంలో చర్చ జరగనుంది. వివిధ రంగాలు, శాఖలు, సమాఖ్య సమస్యలపై చర్చించడానికి నీతి ఆయోగ్ పాలకమండలి ఒక వేదికగా పని చేస్తోంది. ఇందులో ప్రధానమంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలితప్రాంతంగా పాల్గొనడంతో పాటు లద్దాఖ్ తొలిసారిæఈ సమావేశంలో పాల్గొంటోంది. ఈ సమావేశంలో పాలక మండలి ఎక్స్–అఫిషియో సభ్యులు, కేంద్ర మంత్రులు, వైస్ చైర్మన్, సభ్యులు, నీతి ఆయోగ్ సీఈవో, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment