
సాక్షి,రాజేంద్రనగర్: సెలవురోజు ఆదివారం కావడంతో కిందిస్థాయి నాయకులు, చోటామోట లీడర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం, ఆపై ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల వద్దే ఉంటారని భావించిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేయాలని భావించారు. బలగం చూపించుకోవడానికి జనం అవసరం కావడంతో చోటామోట లీడర్లు, గల్లీస్థాయి నాయకులను ఆశ్రయించారు.
ప్రచారం తర్వాత బిర్యానీ, మద్యం, ఆపై డబ్బులు ఇస్తామని హామీ ఇస్తేనే వస్తామని వారు తెగేసి చెప్పడంతో చేసేది లేక నేతలు అంగీకరించాల్సి వచ్చింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆదివారం పెద్దఎత్తున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment