ముంబై: ప్రధాని మోదీకి ఎన్‌సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్‌అఘాడీ(ఎమ్‌వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్‌లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు.
మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.
తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.
కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment