సోలాపూర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విపక్షాలపై మాటల దాడి పెంచారు. మంగళవారం(ఏప్రిల్30) మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే సీట్లలో కూడా పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు.
విదర్భ ప్రాంతంలో రైతుల దుస్థితికి ఎన్సీపీ(శరద్‌పవార్), కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు.‘దేశం కాంగ్రెస్ పార్టీకి 60 ఏళ్లు చాన్స్ ఇచ్చింది. ఈ 60 ఏళ్లలో ఎన్నో దేశాల రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కనీసం పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోయింది. ఈ ప్రాంతం నుంచి ఒక పెద్ద లీడర్ 15 సంవత్సరాల క్రితం సీఎంగా చేశారు.
కరువు ప్రాంతాలకు నీళ్లిస్తానని చెప్పి పదవిలోకి వచ్చాడు. కానీ ఆయన చెప్పినవేవీ జరగలేదు. ఇప్పుడు ఆయనను శిక్షించాల్సిన సమయం వచ్చింది’అని మాజీ సీఎం సుశీల్‌కుమార్‌షిండేను ఉద్దేశించి ప్రధాని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లో సుశీల్‌షిండే కుమార్తె ప్రణతి షిండే సోలాపూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment