
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. హుగ్లీలో టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న బూత్ ఏజెంట్‌ను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ బూత్ ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి, ఒక ఆశా వర్కర్‌ను బూత్‌లో కూర్చోబెట్టారని లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఆ ఆశా వర్కర్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లతో టీఎంసీకి అనుకూలంగా ఓటువేయాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ తృణమూల్ ఏజెంట్ అని లాకెట్ చటర్జీ పేర్కొన్నారు.
ఆ మహిళను పట్టుకుని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదని ఆమె అన్నారు. దీనిపై బూత్ ఏజెంట్‌ను ప్రశ్నించగా, ఆమె ఓటర్లు క్యూలో నిలుచునేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బూత్ వద్ద ఎక్కువ మంది ఓటర్లు లేరని లాకెట్ చటర్జీ తెలిపారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment