ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా కేజ్రీవాల్ ప్రచారంలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న ఒక దుకాణంలో కేజ్రీవాల్ మూమూస్ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలతో పాటు ఒక దుకాణం దగ్గర మోమోస్ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ‘ఢిల్లీ వాసులకు, మోమోలకు మధ్య అనుబంధం విడదీయరానిది. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న కేజ్రీవాల్‌ను స్వాగతిస్తూ ఒక మోమోస్ విక్రేత అతనికి మోమోస్ అందించారు’ అని రాసింది.
दिल्लीवालों और मोमो का रिश्ता थोड़ा गहरा है 🥟♥️
नई दिल्ली विधानसभा में चुनाव प्रचार के दौरान एक मोमो वाले भाई ने दिल्ली के बेटे @ArvindKejriwal जी को रोककर खिलाये मोमो‼️ pic.twitter.com/ydnOddSK5y— AAP (@AamAadmiParty) January 19, 2025
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ లపై పోటీకి దిగారు. 2013 నుండి న్యూఢిల్లీ స్థానం నుండి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముక్కోణపు పోరుగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా తన సత్తాను చాటేందుకు ఎన్నికల రంగంలోకి దిగింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 ఓటింగ్ జరగనుండగా, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే
Comments
Please login to add a commentAdd a comment