
బద్వేలు (వైఎస్సార్‌జిల్లా): బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దూసుకుపోతుందని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే అని ఎమ్మెల్యే రోజా అన్నారు.
గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం తాము.. ప్రచారం చేస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని రోజా కోరారు. కాగా, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దొంగ నాటకాలాడిన ప్రజలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment