
సాక్షి, బద్వేలు(వైఎస్సార్ కడప): బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా తరపున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలని ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధని భారీ మెజార్టీతో గెలిపించాని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment