
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు. వారు ప్రజల మన్ననలను పొందారని అన్నారు.
చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు సీఎంలుగా పనిచేశారు.. ఒకరు మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే, మరొక సీఎం(కిరణ్ కుమార్ రెడ్డి) రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.