Badvel ByPoll
-
సీఎం జగన్‌ను కలిసిన బద్వేలు ఎమ్మెల్యే సుధ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సుధతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను సీఎం అభినందించారు. అనంతరం డాక్టర్ సుధ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా భావించి.. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బద్వేలు చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాని గొప్ప మెజార్టీని అందించిన ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. సీఎం వైఎస్ జగన్ గతంలో బద్వేలు అభివృద్ధికి నిధులు ప్రకటించారని, ఎన్నికల కోడ్ వల్ల ఆ పనులు పూర్తి కాలేదన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పారు. తన విజయానికి కారకులైన ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
భవిష్యత్‌లో పోటీ చేస్తారా? లేదా? అనే మీమాంసతో టీడీపీ శ్రేణులున్నాయి
-
బద్వేల్ లో వైస్సార్సీపీ మెజారిటీ రికార్డు
-
బద్వేలు తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది
-
బద్వేల్ తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్: నందిగం సురేష్
సాక్షి, అమరావతి: విహార యాత్రకు వచ్చినట్టు చంద్రబాబు ఏపీకి వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు ఇళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వీరంతా రాష్ట్రానికి సంబంధంలేని వ్యక్తులుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. చదవండి: బద్వేలు బ్లాక్ బస్టర్ ‘‘చంద్రబాబు ఫ్యామిలీ ఓట్లు కుప్పంలో లేవు. చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చే వారిని ప్రజలు నమ్మరు. అమరావతిలో ఇళ్ల పంపిణీని అడ్డుకుంది చంద్రబాబు కాదా?. బద్వేల్ తీర్పుతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. పాదయాత్ర పేరిట అమరావతి జనాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు తాపత్రయం అంతా కొంతమంది ప్రయోజనాల కోసమేనని’’ నందిగం సురేష్ దుయ్యబట్టారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ‘‘బద్వేల్లో ఓడింది టీడీపీ, జనసేన కూడా. బీజేపీకి 21 వేల ఓట్లు ఎలా వచ్చాయనేది ఆలోచించాలి. చంద్రబాబు పరోక్షంగా సహకరించి ఓట్లు వేయించాడు. ఎన్నికకు దూరం అంటూనే బీజేపీ మద్దతు పలికి తన బుద్ధి ఏమిటో స్పష్టం చేశాడు. సీఎం వైఎస్ జగన్ ఓటు పులివెందులలో ఉంటే.. చంద్రబాబు, లోకేశ్ ఓట్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. అమరావతిలో చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారు. తాను అనుకున్న బినామీ రాజధాని కోసం పేదలకు ఇళ్లు ఇస్తే మురికి కూపం అవుతుందన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్నింటితో పాటు అభివృద్ది చేస్తారు. అక్కడి వారిని రెచ్చగొట్టి చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారు. ఈ యాత్ర రాయలసీమ నుంచి కూడా వెళ్తుంది. వారికి ఏమి సమాధానం చెప్తారు’’ అంటూ సురేష్ ప్రశ్నించారు. -
ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారు : పెద్దిరెడ్డి
-
టీడీపీ గుర్తింపు రద్దుచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని, ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తూ దురుద్దేశపూర్వకంగా అవమానించే చర్యలకు పాల్పడితే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్, 1971 తరహాలో చట్టం తీసుకురావాలని కేంద్ర న్యాయమంత్రిని ఆదేశించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, పట్టాభిరామ్ తదితరులు వాడుతున్న అసభ్య, నీచమైన పదజాలాన్ని రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఎంపీలు మార్గాని భరత్‌రామ్, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, రెడ్డెప్ప, బీవీ సత్యవతిలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు రాష్ట్రపతిని కలిసి టీడీపీ నేతలు వాడుతున్న భాష, ఆచరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వివరించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారో చెప్పాం. తప్పుచేసి చంద్రబాబు రాష్ట్రపతి దగ్గరకువెళ్తే.. చంద్రబాబు ఏ రకంగా తప్పుచేశారో వివరించడానికి మేం రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాం. రాష్ట్ర పరువు, ప్రతిష్ట, ప్రజల ఆత్మగౌరవం చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో రాష్ట్రపతికి వివరించాం. టీడీపీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా మాట్లాడుకునేది బూతు భాష. ఇతరులను సంబోధించేది కూడా బూతు భాషతోనే. అందుకే టీడీపీ అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అనడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్రపతికి బోషడీకే అనే పదాన్ని ఎలా వివరించాలో అర్థంగాక ఎంతో సతమతమయ్యాం. చివరకు ఆయన అర్థం చేసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అంటేనే సంస్కారవంతమైన పార్టీ. టీడీపీ సంస్కారహీనమైన పార్టీ. పట్టాభి వ్యాఖ్యలు ఖండించడం లేదంటే చంద్రబాబును సంస్కారహీనుడు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. టీడీపీ అధికార ప్రతినిధి వాడిన పదం చంద్రబాబు రాష్ట్రపతికి చెప్పారా అని మరోసారి అడుగుతున్నాం. రెండున్నరేళ్లుగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అందుకే టీడీపీ నేతలు బూతు భాష వాడుతున్నారు. టీడీపీ అతి త్వరలోనే అంతర్థానం కాబోతోంది. అందుకే ఆ పార్టీ నేతలు యాంటీసోషల్ ఎలిమెంట్స్‌గా, టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రతిష్ట మంటగలుపుతున్నారు. టీడీపీ చేస్తున్న పిచ్చిపిచ్చి పనులన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం..’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. కాగా, బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సాధించిన విజయం రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతమని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం బద్వేలు విజయం అని ఆయన పేర్కొన్నారు. -
‘ఫ్యాన్’ హ్యాట్రిక్
సాక్షి, అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు విజయభేరి మోగించడం ద్వారా వైఎస్సార్సీపీ హ్యాట్రిక్ సాధించింది. తాజా ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బద్వేల్ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ బద్వేల్ శాసనసభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులే నెగ్గారు. టీడీపీ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా.. లోపాయికారీగా జట్టు కట్టినా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం.. బద్వేల్ శాసనసభ స్థానానికి తొలిసారిగా 1955లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ 17 సార్లు ఎన్నికలు (రెండు సార్లు ఉప ఎన్నికలు) నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత బద్వేల్ స్థానానికి 2014లో నిర్వహించిన ఎన్నికల్లో 50.66 శాతం ఓట్లను సాధించిన పార్టీ అభ్యర్థి జయరాములు 9,502 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి ఎన్డీ విజయజ్యోతిపై విజయం సాధించారు. 2019లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య 60.89 శాతం ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్‌పై 44,734 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. తాజాగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ ఆధిక్యతంతో విజయబావుటా ఎగురవేశారు. ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ వైఎస్సార్ సీపీ బలం పెంచుకుని ఆధిక్యతను చాటుతోంది. -
ముగ్గురూ ఏకమైనా డిపాజిట్ గల్లంతు
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ, జనసేనలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా బద్వేలు ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి కేవలం 21,678 ఓట్లు మాత్రమే దక్కడంతో ఈ ఎన్నికల్లో నిర్విరామంగా పనిచేసిన 3 పార్టీల నేతల్లో అంతర్మథనం మొదలైంది. టీడీపీ క్యాడర్‌కు డబ్బులు పంచి తమవైపు తిప్పుకోవడంతోపాటు కేంద్ర బలగాలను దించినా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 32.36 శాతం ఓట్లు లభించగా ఈసారి జనసేన సైతం సహకరించినా బీజేపీ అభ్యర్థికి 14.73 శాతం ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు గత ఎన్నికల్లో 95,482 (60.89 శాతం) ఓట్లు వచ్చాయి. అప్పుడు 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ కాగా ఈసారి 1,47,166 (68.39 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 8 శాతం తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 1,12,211 (76.24 శాతం) ఓట్లు లభించడం గమనార్హం. సర్వశక్తులూ ఒడ్డినా.. బద్వేలులో బీజేపీకి నామమాత్రంగా కూడా క్యాడర్ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పోటీ చేయగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో బద్వేలు బరిలోకి దిగిన పణతల సురేష్ గత ఎన్నికల్లో రైల్వేకోడూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా 1,049 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ పాత పరిచయాలతో టీడీపీ నేతలతో మంతనాలు జరిపి తమ అభ్యర్థికి సహకరించాలని లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. బీజేపీ ఏజెంట్లుగా కూర్చునేలా ఒప్పించారు. మరోవైపు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రస్థాయి నేతలను బద్వేలుకు తరలించి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ఎన్నికల నాటికి పోలింగ్ వ్యూహాలను టీడీపీకి అప్పగించి చేతులెత్తేసింది. 281 పోలింగ్ బూత్‌లు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు కేవలం 10 కేంద్రాల్లో మాత్రమే ఏజెంట్లుగా ఉండగా మిగిలిన అన్నిచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలే ఏజెంట్లుగా ఉన్నారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచుల స్థాయి నేతలు సైతం ఏజెంట్లుగా కూర్చున్నా ప్రయోజనం దక్కలేదు. -
సీఎం పాలన వల్లే బంపర్ మెజారిటీ
బద్వేలు: సీఎం వైఎస్ జగన్ హామీలను విశ్వసించి ఇక్కడి ప్రజలు అప్పట్లో తన భర్తకు 45 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని.. ప్రస్తుత రెండున్నరేళ్ల పాలనలో సీఎం ఆ హామీలను అమలు చేయడం చూసి, ఇప్పుడు అంతకు రెట్టింపు మెజారిటీ ఇచ్చారని వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ దాసరి సుధ అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన అనంతరం ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు.. సాక్షి: రాజకీయాల్లోకి వస్తానని ఊహించారా? సుధ: మాకు రాజకీయాలు కొత్త. గతంలో కూడా మా కుటుంబీకులెవరూ ఎన్నికల్లో పోటీచేయలేదు. నా భర్త 2019లో వైఎస్సార్సీపీ తరఫున బద్వేలు నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన హఠాన్మరణంతో ఆయన సేవను కొనసాగించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా. సాక్షి: ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి.. పోరాడడానికి స్ఫూర్తి ఎవరు? సుధ: సీఎం వైఎస్ జగన్ మాటలే నాకు స్ఫూర్తి. భర్త మరణం తరువాత సీఎంగారు పరామర్శకు వచ్చారు. జరిగిన విషాదాన్ని త్వరగా మర్చిపోవాలంటే ప్రజాసేవ ఒకటే మార్గం.. ప్రజలకు మంచి చేస్తే కలిగే సంతృప్తి ముందు విషాదం పెద్ద విషయం కాదు, మీరు పోటీచేయండి.. తోడ్పాటు అందిస్తామని ఉత్సాహపరిచారు. దీంతో తక్కువ సమయంలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు సిద్ధపడ్డా. సాక్షి: ఇంత మెజారిటీ వస్తుందని ఊహించారా? సుధ: తప్పకుండా వస్తుందని అనుకున్నాం. అనుకున్న దానికంటే 5 నుంచి 10 వేలు తక్కువే వచ్చాయి. వర్షాలు పడటంతో చాలామంది ఓటింగ్‌కు రాలేదు. బీజేపీకి 90% ప్రాంతాల్లో ఏజెంట్లు ఉండరనుకున్నాం. కానీ, టీడీపీతో కుమ్మక్కై ప్రలోభాలతో ఆ పార్టీ నేతలను ఏజెంట్లుగా కూర్చోబెట్టారు. బీజేపీకి ఓట్లు వేయాలని టీడీపీ ముఖ్య నేతలు చెప్పడంతోనే కొంత మెజారిటీ తగ్గింది. సాక్షి: బద్వేలుకు ఏం చేయాలనుకుంటున్నారు? సుధ: 4 నెలల కిందట సీఎం వైఎస్ జగన్ బద్వేలు అభివృద్ధికి రూ.700 కోట్లు పైగా నిధులు ప్రకటించారు. ఎన్నికల కోడ్‌తో ఈ పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం త్వరితగతిన వీటన్నింటిని పూర్తిచేయడమే లక్ష్యం. బద్వేలు మున్సిపాలిటిలో రోడ్లు, డ్రైనేజీ పనుల పూర్తికి ప్రత్యేక కృషిచేస్తాం. సాక్షి: నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక ఉందా? సుధ: నియోజకవర్గంలో సాగునీటి వనరులు ఇప్పటికే వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో మెరుగయ్యాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి దొరికేలా చూడాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా. వ్యవసాయాధారిత పరిశ్రమలతో పాటు ఇతర ఉపాధి మార్గాలను అధ్యయనం చేస్తా. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలి. సాక్షి: డాక్టర్‌గా వైద్య సేవలను ఎలా మెరుగుపరుస్తారు? సుధ: నా భర్త డాక్టర్ కావడంతో ప్రజల ఆరోగ్యంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించేవారు. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్‌సీ, సీమాంక్ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్యం అందేలా చూస్తా. డయాలసిస్ రోగులు దూరంగా ఉన్న కడపకు వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్నారు. డెల్ కంపెనీ సహకారంతో బద్వేల్‌లోనే డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషిచేస్తా. ఇది నా భర్త మొదలు పెట్టారు. దీన్ని పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నా. సాక్షి: మహిళాభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? సుధ: యువతకు వృత్తివిద్యా కోర్సులను నేర్పించి స్థానికంగా ఉపాధి లభించేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను ఉపయోగించుకునేలా చూస్తా. స్థానికంగానే ఉంటూ నిరంతరం యువత, మహిళలతో అనుబంధం పెంచుకుంటూ వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. అందరికీ కృతజ్ఞతలు నా విజయానికి తోడ్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేనిది. వీరంతా నా విజయానికి ఎంతో కష్టపడ్డారు. నా కుటుంబ సభ్యులు సైతం కష్టకాలంలో అండగా నిలిచారు. వీరందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తా. -
ఎన్నిక ఏదైనా ప్రజాతీర్పు ఒక్కటే
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఏవైనప్పటికీ వైఎస్సార్సీపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మనసారా ఆశీర్వదిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న కుట్రలను ‘ఓట్లే’ అస్త్రాలుగా ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నారు. తాజాగా బద్వేల్ ఉప ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధను అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ స్థానానికి ఉప ఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహించింది. ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్‌నే తాము మరోసారి బరిలోకి దించుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సాంప్రదాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థిని పోటీకి దించడం లేదని చంద్రబాబు ప్రకటించారు. పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారం కూడా చేసి చివరకు ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించినట్లు డ్రామా ఆడిన తరహాలోనే ఈ ఉప ఎన్నికలోనూ చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేశారు. బీజేపీ–జనసేన కూటమి తరఫున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి సురేష్ తరఫున చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహరించారు. ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ టీడీపీ నేతలే పర్యవేక్షించారు. పోలింగ్ ఏజెంట్లుగానూ టీడీపీ నేతలే కూర్చున్నారు. అంటే బీజేపీ–జనసేన–టీడీపీ లోపాయికారీగా జట్టు కట్టినట్లు స్పష్టమవుతోంది. మూడు పార్టీలు లోపాయికారీగా జట్టుకట్టి బరిలోకి దిగినా సరే వైఎస్సార్సీపీ అభ్యర్థికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి చివరి వరకూ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి 90,533 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బద్వేల్ ఎన్నికల చరిత్రలో ఇదే భారీ మెజార్టీ కావడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 1,47,166 ఓట్లు పోల్ కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థికి 1,12,211 (76.25 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీ లోపాయికారీగా మద్దతు ప్రకటించిన బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థి సురేష్‌కు 21,678 (14.73 శాతం) ఓట్లు వచ్చాయి. మూడు పార్టీలూ సహకారం అందించినా సురేష్ డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ 6,235 ఓట్లకు పరిమితమైంది. సుపరిపాలనకు ప్రజల మద్దతు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.26 శాతం), 22 ఎంపీ సీట్లతో (88 శాతం) వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి ఏడాదిలోనే 95 శాతానికిపైగా హామీలను అమలు చేశారు. తద్వారా దేశంలో సరికొత్త రాజకీయాలకు తెరతీశారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతోపాటు దేశంలో ఎక్కడా లేని రీతిలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. ఇది చూసి ఓర్చుకోలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిత్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తూ వస్తున్నారు. వాటిని ప్రజలు ఎప్పటికప్పుడు తమ తీర్పు ద్వారా తుత్తునియలు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తున్నారు. ► రాష్ట్రంలో 13,081 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 81 శాతం అంటే 10,536 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులనే గెలిపించడం ద్వారా ప్రజలు తమ మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించారు. ► 75 పురపాలక (మున్సిపాలిటీలు), 12 నగరపాలక(కార్పొరేషన్) సంస్థలకు, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలోకి దించుతూ చంద్రబాబే బీ–ఫారాలు జారీ చేశారు. పురపాలక, నగరపాలక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని రోజుకో డ్రామా ఆడుతూ సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించి డ్రామాను తుది అంకానికి చేర్చినా ఘోర పరాజయం తప్పలేదు. ► తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ–జనసేన, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డినా ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలతో పోల్చితే టీడీపీకి 5.57 శాతం ఓట్లు తక్కువగా వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 56.67 శాతం ఓట్లు, 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ప్రజలు అపూర్వ విజయాన్ని అందించి సీఎం జగన్ పాలనకు మద్దతు పలికారు. పరిషత్ ఎన్నికల్లో చారిత్రక విజయం.. రాష్ట్రంలో 9,583 ఎంపీటీసీ స్థానాలు, 638 జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని కుట్ర లేదు. వాటిని అడ్డుకున్న ప్రజలు ఏకంగా 8,249 ఎంపీటీసీ స్థానాల్లో (86 శాతం) వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. 638 జడ్పీటీసీ స్థానాల్లో 630 చోట్ల (98.75 శాతం) వైఎస్సార్సీపీ అభ్యర్థులనే గెలిపించడం ద్వారా చారిత్రక విజయాన్ని అందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అన్ని జిల్లా పరిషత్‌ల్లోనూ (13 జిల్లా పరిషత్లకునూగా 13) వైఎస్సార్సీపీని గెలిపించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనను దీవించారు. సంక్షేమ, అభివృద్ధి పాలనకు జేజేలు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతానికిపైగా తొలి ఏడాదిలోనే అమలు చేసిన చరిత్ర ఇప్పటిదాకా లేదు. సీఎం జగన్ గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలనలో సంస్కరణలు తెచ్చి వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పాలనను తీసుకెళ్లారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. సమతుల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేయడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. పేదలకు ఏమాత్రం కష్టం కలగనివ్వకుండా సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం తపిస్తూ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్‌కు ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. -
బద్వేలు బ్లాక్ బస్టర్
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత నెల 30న పోలింగ్ జరగ్గా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు రికార్డు స్థాయిలో 90,533 ఓట్ల మెజార్టీ లభించింది. డాక్టర్ సుధకు మొత్తం 1,12,211 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పణతల సురేష్‌కు 21,678 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6,235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,650 ఓట్లు పడ్డాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు 3,389 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లని ఓట్లు పడ్డాయి. బద్వేలులో మొత్తం 2,15,240 మంది ఓటర్లకుగానూ 1,47,166 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లతో ఆధిక్యం ఆరంభం మంగళవారం ఉదయం 8.00 గంటలకు బద్వేలులోని బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం సాధించింది. 183 పోస్టల్ బ్యాలెట్లలో 139 ఓట్లు అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థికి లభించాయి. బీజేపీ అభ్యర్థికి 17, కాంగ్రెస్ అభ్యర్థికి 18 చొప్పున ఓట్లు వచ్చాయి. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా 9.00 గంటల ప్రాంతంలో తొలి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 8,790 ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తర్వాత వరుసగా 13 రౌండ్లలోనూ భారీ మెజార్టీ వచ్చింది. తొలుత 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావించినా ఒక ఈవీఎం మొరాయించడంతో దానికి సంబంధించి 13వ రౌండ్లో వీవీ ప్యాట్లను లెక్కించారు. దీంతో మొత్తం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ముగిసింది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్‌గార్గ్‌తోపాటు ఎన్నికల అబ్జర్వర్ల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రశాంతంగా పూర్తైంది. రెట్టింపు మెజార్టీతో విజయభేరి బద్వేలులో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు 44,734 ఓట్ల మెజార్టీ లభించింది. వెంకట సుబ్బయ్యకు 60.89 శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌కు 32.36 శాతం ఓట్లు వచ్చాయి. 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో 1,47,166 (68.39 శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 8 శాతం తక్కువగా పోలింగ్ నమోదైనా వైఎస్సార్ సీపీకి గతంలో కంటే రెట్టింపు మెజార్టీ లభించడం గమనార్హం. ఆనందోత్సాహాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ రికార్డు మెజార్టీతో విజయం సాధించడంతో బద్వేలు నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నాయి. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజాదరణకు తాజా ఎన్నికల తీర్పు నిదర్శనమన్నారు. స్వచ్ఛమైన పాలనకు లభించిన విజయం ‘ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. నాడు బద్వేలు ప్రజలు నా భర్త, దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్యకు 44వేల మెజారిటీ ఇస్తే నేడు సీఎం జగన్ నిష్పక్ష పాలన, సామాజిక న్యాయం, మాట మీద నిలబడే తత్వం చూసి నాకు 90 వేల పైచిలుకు మెజారిటీతో విజయం చేకూర్చారు. నిధులు కేటాయించిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. నాకు టిక్కెట్ ఇచ్చి పోటీ చేసేందుకు ప్రోత్సాహం అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. నా విజయానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, నియోజకవర్గ ఇన్చార్జి డీసీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా విజయం కోసం అక్క చెల్లెమ్మలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కృషి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటా’ – డాక్టర్ దాసరి సుధ, బద్వేలు ఉప ఎన్నిక విజేత -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
-
ఓడిపోతామని ముందే తెలిసే ఇలా....
-
ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతుంది: సజ్జల రామకృష్ణా రెడ్డి
తాడేపల్లి: టీడీపీ నేతలు బీజేపీకి ఏజెంట్లుగా పనిచేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం.. బరిలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్నారు. పోటీలో లేకపోయినా జనసేన, టీడీపీ ప్రచారం చేశాయని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రలను బద్వేలు ప్రజలు తిప్పికొట్టారన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
-
‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’
తాడేపల్లి: బద్వేలు తీర్పు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకానికి నిదర్శనమని ప్రభుత్వవిప్ కోరుముట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, మేనిఫెస్టోను అమలు చేసి సీఎం జగన్ తన క్రెడిబిలిటీ నిరూపించుకున్నారని ప్రశంసించారు. టీడీపీ కుట్రలు చేసి అలజడి సృష్టించాలనుకున్నా ఏమిచేయలేకపోయారని కోరుముట్ల శ్రీనివాస్ విమర్శించారు. బద్వేల్లో ప్రజలు.. రికార్డు స్థాయిలో దాసరి సుధకు 90 వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు. ‘ప్రజలు నైతిక పాలనకు ప్రజలు దివేనలు అందించారు’ కర్నూలు: కరోనా విపత్తులోను.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కావాలనే వైఎస్ జగన్ పాలనపై పనిగట్టుకుని బురద జల్లుతున్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా ప్రతి పక్షనేతలు.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.బద్వేలు ఎన్నికల్లో టీడీపీ హైడ్రామాలు ఆడిందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ విమర్శించారు. నైతికంగా సుపరిపాలన అందిస్తున్న.. వైఎస్ జగన్ పాలనకు ప్రజలు దివెనలు అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. -
మూడు పార్టీలు కలిసినా కూడా డిపాజిట్ దక్కలేదు: ఎంపీ అవినాష్ రెడ్డి
కడప: బద్వేలు ఉప ఎన్నికలు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు రెఫరెండంగా భావించారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు దేశం మొత్తం గర్వించేలా సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అలుపెరగకుండా కష్టపడ్డారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేశారని తెలిపారు. టీడీపీ, బీజేపీకి పూర్తిగా సహకరించిందని విమర్శించారు. బీజేపీ,జనసేన, టీడీపీలు కలిసినా డిపాజిట్ కూడా దక్కలేదని పేర్కొన్నారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. మరింత మన్ననలు పొందేలా పనిచేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’
వైఎస్సార్ కడప: సీఎం వైఎస్ జగన్ పై అభిమానంతో గత ఎన్నికల్లో 45 వేలు మెజారిటీ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. బద్వేల్లో ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని అన్నారు. కుప్పంలో చంద్రబాబు వాగుడు చూశామని,. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రలు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. ఏ సెంటర్ అయినా. ఏమైనా సింగిల్ హ్యాండ్‌తో వైఎస్సార్సీపీని ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు రోజా పాదాభివందనం తెలిపారు. అదే విధంగా, టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. చదవండి: డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్ -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు’’ అన్నారు సీఎం జగన్. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను’’ అని సీఎం జగన్ తెలిపారు. (చదవండి: ‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’) దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 బద్వేల్ ఉప ఎన్నికలో భారీ విజయం నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌ని కలిశారు. అలానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ని కలిశారు. చదవండి: ‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’ చదవండి: అవార్డు గ్రహీత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్ -
చంద్రబాబు కుప్పంలో నీ డ్రామాలు చూసాం, బద్వేల్ ఎలెక్షన్ తో అయినా బుద్ధి తెచ్చుకో..
-
మూడు పార్టీలు కలిసి వచ్చినా డిపాజిట్లు కూడా సాధించలేకపోయారు
-
ఏపీలో ముందే వచ్చిన దీపావళి: టీజేఆర్ సుధాకర్ బాబు
-
సీఎం జగన్ సంక్షేమ పాలనకు పట్టం కట్టిన బద్వేల్ ప్రజలు
-
ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు