వైఎస్సార్ జిల్లా: బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేపు(మంగళవారం) ఉదయం 8 కు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొత్తం 281 పోలింగ్ బూతుల కోసం నాలుగు హాల్స్ లో 28 టేబుల్స్ ఏర్పాటు.. మొత్తం 10 రౌండ్స్ లో లెక్కింపు చేస్తారు. మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు చేశారు.
రేపు ఉదయం అభ్యర్థులు, ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తారు. అనంతరం మొదటగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారు.. ఇప్పటి వరకు 235 పోస్టల్ బ్యాలెట్ అందాయని, సర్వీస్ ఓటర్లకు రేపు ఉదయం వరకూ సమయం ఉందని రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఒకవేళ వర్షం పడినా ఎటువంటి అంతరాయం కలగకుండా కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment