సాక్షి, వైఎస్సార్: కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయి.. బీజేపీకి అడ్రెస్ లేదు.. ఇలాంటి పార్టీలు ఏ అర్హతతో ఓట్లు అడుగుతాయి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అనే బేధం చూడకుండా సంక్షేమం అందిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించాము. తాగునీటి సమస్య శాశ్విత పరిష్కరం కోసం బ్రహ్మం సాగర్ ద్వారా పనులు చేస్తున్నాం నియోజకవర్గ పరిధిలో ఐదు వేల ఇళ్లు ఇచ్చాం. నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పెద్దిరెడ్డి తెలిపారు.
(చదవండి: టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే)
‘‘సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మా ముఖ్యమంత్రి సమపాళ్లతో అభివృద్ధి చేస్తున్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. 75 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని అంటున్నారు.. 75 కాదు లక్ష కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఇచ్చాం. అప్పులు ఎక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు, కరోనా సంక్షోభంలో ప్రజలకు అండగా నిలిచాము. నోబెల్ గ్రహీత అమర్థ్య సేన్ చెప్పినట్లు హెలికాప్టర్ మనీ ద్వారా కరోనా సంక్షోభంలో అందరిని ఆదుకున్నాం. కేంద్రం కంటే జీఎస్‌డీపీలో ముందున్నాం.. జీడీపీలో రాష్ట్రమే ముందుంది.
(చదవండి: ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడడమా!)
‘‘ఎన్నికలు సాఫీగా జరుపుకోవాలని బీజేపీకి లేదు. దేవాలయాలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ దేవాదాయశాఖ మంత్రిగా ఉండి విజయవాడలో దేవాలయాలను విధ్వసం చేశారు. మాది సెక్యూలర్ పార్టీ.. మాకు కులాలు, మతాలు లేవు.. హిందు మతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. అన్ని మతాలకు సమంగా చూస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మతమార్పిడిలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఓట్లు లేవు కాబట్టి ఎదో ఒక రచ్చ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే బీజేపీ ప్రయత్నం. దానిలో భాగంగానే బీజేపీ నేత సునీల్ థియోదర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు.
చదవండి: సమగ్ర భూ సర్వే అమలుకు మంత్రుల కమిటీ
Comments
Please login to add a commentAdd a comment