
సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి బుధవారం ఆఖరి రోజు కావడంతో రాజకీయపార్టీలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బద్వేల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ ఎప్పుడో గెలిచారు. మెజారిటీ కోసమే ప్రచారం. టీడీపీ జనసేన లోపాయకారి కుట్రలు కొనసాగిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.
జనసేన అధినేతకు నిజాయితీ ఉందా?. చనిపోయిన అభ్యర్థి వెంకటసుబ్బయ్య కుటుంబంపై సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నాం అన్నారు కదా పవన్. ఇప్పుడేంటి ఈ నీతిమాలిన రాజకీయం?. అమిత్ షాపై రాళ్లు వేసిన ఘటన ఆయనకు గుర్తుండదా.. అందుకే చంద్రబాబుకి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం. మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా..? అంటూ చంద్రబాబుపై అంబటి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment