సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 76.25 శాతం ఓట్లను వైఎస్సార్‌సీపీ సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్‌సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది.
డిపాజిట్లు గల్లంతు
బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయి. బద్వేల్ ప్రజలు, సీఎం జగన్ వెంటే ఉన్నారని డాక్టర్ సుధ అన్నారు. గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో గెలిపించారని.. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని డాక్టర్ సుధ పేర్కొన్నారు.
(Badvel By Election: రౌండ్ల వారీగా బద్వేల్ ఉప ఎన్నిక ఫలితాలు)
Comments
Please login to add a commentAdd a comment