
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దాసరి సుధతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన పాపం వారిని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కనుమరుగయ్యేలా చేశాయి. బీజేపీ గురించి ఇక ఎవరికి తెలియదు. ఆ పార్టీకి ఎవరూ ఓటు కూడా వెయ్యరు.
ప్రభుత్వం చేపట్టిన సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశాము. బద్వేలు నియోజకవర్గ పరిధిలో సాగు, తాగు నీరు కోసం చేస్తున్న కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేయలేదు. కేవలం అర్హతే కొలబద్దగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం ఫలాలను అందిస్తున్నాం. కరోనా పరిస్థితులు ఎదుర్కొంటూ సంక్షేమం కుంటుపడకుండా పాలన అందిస్తున్న సీఎం జగన్' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. ఉపఎన్నికలో ఎవ్వరూ ఊహించని భారీ ఆధిక్యత సాధించాలి. ప్రతి ఓటరు దగ్గరికీ వెళ్లి ప్రభుత్వ పాలన గురించి వివరించి ఓట్లు అడగండి' అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment