![MLA Roja Comments On TDP Over Badvel Bypoll Majority To YSRCP - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/2/Roja.jpg.webp?itok=2N7jMbsD)
వైఎస్సార్ కడప: సీఎం వైఎస్ జగన్ పై అభిమానంతో గత ఎన్నికల్లో 45 వేలు మెజారిటీ ఇస్తే, జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన చూసి 90 వేలకు పైగా మెజారిటీ అందించారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. బద్వేల్‌లో ప్రజలు సుపరిపాలనకు పట్టం కట్టారని అన్నారు. కుప్పంలో చంద్రబాబు వాగుడు చూశామని,. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రలు చేసినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారన్నారు.
ఏ సెంటర్ అయినా. ఏమైనా సింగిల్ హ్యాండ్‌తో వైఎస్సార్‌సీపీని ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు రోజా పాదాభివందనం తెలిపారు. అదే విధంగా, టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment