
కడప కోటిరెడ్డి సర్కిల్: బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో పోటీచేయాలని జనసేనను అభ్యర్థించామని, ఆపార్టీ అధ్యక్షుడు పవన్ విముఖత చూపారని అందుకే బీజేపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు. అభ్యర్థి విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వానికి కొన్ని పేర్లు పంపించినట్లు్ల చెప్పారు.