పెదవాల్తేరు (విశాఖ తూర్పు): బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. విశాఖలోని లాసన్స్‌బేకాలనీలో ఉన్న బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాని బుధవారం ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్టీల్‌ప్లాంట్‌ని ఇక్కడే కొనసాగించాలని ఏపీ బీజేపీ గతంలోనే కేంద్రానికి స్పష్టం చేసిందని చెప్పారు. గనుల రద్దు విషయం మైన్స్ పాలసీలో భాగంగానే జరిగిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేనతో పొత్తుపై ప్రశ్నించగా..రాష్ట్రంలో 1.35 కోట్ల రైస్ కార్డుదారులతో తమ పొత్తు ఉంటుందని, 30 లక్షల ఇళ్లు పొందిన ప్రజలతో పొత్తు ఉంటుందని, 1.35 లక్షల జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డులు పొందిన వారితో తమ పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు విష్ణుకుమార్‌రాజు,మాధవ్ తదితరులు పాల్గొన్నారు
మా పొత్తు వారితోనే...!
Published Thu, Apr 7 2022 4:37 AM | Last Updated on Thu, Apr 7 2022 7:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment