బద్వేలు ఉపఎన్నికల్లో రాత్రి 7.00 గంటల వరకు 68.12 శాతం పోలింగ్ నమోదయ్యింది.
Time: 7:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముసిగింది. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్ర ఐదు గంటల వరకు బద్వేల్‌లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. 281 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది.
Time: 5:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు బద్వేల్‌లో 59.58 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
Time: 3:00 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బద్వేల్‌లో 44.82 శాతం పోలింగ్ నమోదయ్యింది.
Time: 12:40 PM:బద్వేల్ ఉప ఎన్నికను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు సీఈఓ విజాయనంద్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం అని విజయానంద్ తెలిపారు.
Time: 1:14 PM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదు అవ్వగా, ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది.
Time: 11:24 AM: బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి సీఈవో విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు.
Time: 11:24 AM: బద్వేల్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ కొన్ని ఛానల్‌లో అవాస్తవ కథనాలు ప్రచారం అవుతున్నాయి. కథనాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ స్పందించారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధమని తెలిపారు. ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులేమీ అందలేదన్నారు. ఎక్కడా పోలింగ్ ఆగలేదని విజయానంద్ స్పష్టం చేశారు.
Time: 11:17 AM: ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది.
Time: 9:32 AM: ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదైంది.
Time: 9:22 AM: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 8.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదైంది.
Time: 8:16 AM: బద్వేల్‌లో టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తోంది. బద్వేల్‌లో చాలాచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మారారు. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోంది. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడంపై టీడీపీ దళిత నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Time: 8:00 AM:
►బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
►కరోనా పేషెంట్లకు సాయంత్రం 6 తర్వాత ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.
►బీసీ వెల్ఫేర్ కార్యాలయ పోలింగ్ స్టేషన్‌ను ఏఎస్పీ మహేష్‌కుమార్ పరిశీలించారు.
Time: 7:56 AM: బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.
►ఉప ఎన్నిక నేపథ్యంలో కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
►ప్రధానంగా రెండు డోసుల టీకా పూర్తయిన వారిని మాత్రమే పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టారు.
►అంతేకాకుండా ఏజెంట్లు, సిబ్బంది కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు.
Time: 7:00 AM: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్ కూడా చేస్తునట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడించారు.
2019లో 77.64 శాతం పోలింగ్
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులతోపాటు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్యర్యంలో మూడు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా లైవ్ వెబ్‌కాస్టింగ్, వీడియో కెమెరాల ద్వారా చిత్రీకరణ చేస్తున్నారు.
ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 160 మంది ఎస్‌ఐలు, 320 మంది హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐలు, 980 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 300 మంది హోం గార్డులు, 15 ప్లాటూన్ల కేంద్ర బలగాలు (960 మంది), 72 రూట్ మొబైల్స్, 36 స్ట్రయికింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్‌లతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment