
సాక్షి, వైఎస్సార్ కడప: గత ప్రభుత్వం బద్వేల్ అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము బ్రహ్మంసాగర్ ద్వారా 7 మండలాలకు నీరు అందించామని తెలిపారు.
బద్వేల్‌కు తాగు, సాగు నీటిని అందిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment