సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా బద్వేల్ నియోజకవర్గం నిలిచిందని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందని తెలిపారు. ఈ ఎన్నిక మాకు నల్లేరు మీద నడక అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చదవండి: నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు
‘దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. భారీ మెజారిటీతో డాక్టర్ సుధ గెలుస్తారు. దాని కోసం మేమంతా కృషి చేస్తాం. ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీ ఆలోచన ఏవిధంగా ఉందో తెలియదు’ అని గోవిందరెడ్డి వెల్లడించారు. ‘ఆ రోజే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లోకి రావాలని నన్ను కోరారు. ఆయన నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది’ అని అభ్యర్థి దాసరి సుధ తెలిపారు.
చదవండి: ‘పవన్ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే
Badvel Bypoll: ఈ ఎన్నిక మాకు నల్లేరు మీద నడక: డీసీ గోవిందరెడ్డి
Published Thu, Sep 30 2021 2:09 PM | Last Updated on Thu, Sep 30 2021 3:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment