dc govinda reddy
-
వారందరికీ నా కృతజ్ఞతలు: దాసరి సుధ
-
బద్వేలు ఎన్నిక మాకు నల్లేరు మీద నడక: డీసీ గోవిందరెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా బద్వేల్ నియోజకవర్గం నిలిచిందని మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైందని తెలిపారు. ఈ ఎన్నిక మాకు నల్లేరు మీద నడక అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చదవండి: నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు ‘దివంగత వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను సీఎం జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. భారీ మెజారిటీతో డాక్టర్ సుధ గెలుస్తారు. దాని కోసం మేమంతా కృషి చేస్తాం. ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ టీడీపీ ఆలోచన ఏవిధంగా ఉందో తెలియదు’ అని గోవిందరెడ్డి వెల్లడించారు. ‘ఆ రోజే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లోకి రావాలని నన్ను కోరారు. ఆయన నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది’ అని అభ్యర్థి దాసరి సుధ తెలిపారు. చదవండి: ‘పవన్ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే -
సీఎం జిల్లాకు ఎందుకు వస్తున్నారో!
కడప కార్పొరేషన్ : ఏదైనా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఏవైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చేపడతారేమో, కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు, వైఎస్ఆర్ జిల్లాకు 25 సార్లు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిసారీ చెప్పినవే చెప్పి మోసం చేశారు, ఇప్పుడు మళ్లీ ఈనెల 17వ తేది ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు డిమాండ్ చేశా రు. మంగళవారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బద్వేల్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వెంకటసుబ్బయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బద్వేల్‌కు రెండుసార్లు వచ్చారని, ఆ రెండు సందర్భాల్లోనూ వందల కోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారని, ఎక్కడో మూలన పడిన తెలుగుగంగ ప్రాజెక్టుపై రాష్ట్ర స్థాయి అధికారులందరినీ పిలి పించి సమీక్ష నిర్వహించడం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా వచ్చిన ప్రతిసారీ జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, రైల్వేకోడూరులో హార్టి కల్చ ర్ కళాశాల, టెక్స్టైల్ పార్కు ఏర్పా టు చేస్తామని చెబుతూనే ఉన్నారుగానీ ఒక్క అడుగు ముందుకు వేయలేదని ఎద్దేవా చేశారు. పేదలకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, పాత ఇళ్లకు రంగులేసి గృహప్రవేశాలు చేశారని మండిపడ్డారు. వైఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఇళ్లు కట్టించారని, జిల్లాలో అనేక చోట్ల కొత్త కాలనీలు ఏర్పా టు చేశారని గుర్తు చేశారు. కడప– కర్నూల్ జాతీయ రహదారి పనులు వైఎస్ హయాం లో శాంక్షన్ చేశారని, అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ భూసేకరణ కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. కడప–తిరుపతి రహదారి అత్యంత దారుణంగా తయారైందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పది కిలోమీటర్ల రోడ్డు వేశారా, కొత్తగా హాస్పిటల్‌గానీ, పీహెచ్సీగానీ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. విద్యారంగంలో వైఎస్ మండలానికో కస్తూర్బా స్కూల్, ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, ఈ ప్రభుత్వం కొత్తగా ఒక హాస్టల్ ఏర్పాటు చేసిందా, ఒక కళాశాల నిర్మించిందా, పోనీ ఒక అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేశారా అని ఎద్దేవా చేశారు. రైతు రథం ట్రాక్టర్లు ఇన్చార్జి మంత్రి ఎవరికి చెబితే వారికి ఇస్తున్నారని, దళారులు ౖరైతులను నట్టేట ముంచుతున్నారని దుయ్యబట్టారు. శ్రీశైలంలో 200 టీఎంసీలు నీరుంటే 50వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు. పట్టిసీమ నీళ్లు, శ్రీశైలం నీరు రెండూ క్రిష్ణా డెల్టాకేనా, రాయలసీమకు ఇవ్వరా అని సూటిగా ప్రశ్నించారు. తెలుగుగంగ కెనాల్ మరమ్మతులు చేయాలని తాము ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు వద్ద 0–18 కి.మీ కెనాల్‌కు లైనింగ్ చేస్తే శ్రీశైలం వరదనీటిని తెచ్చుకొనే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదని మండిపడ్డారు. జిల్లాలో టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని, అది ప్యాచప్ చేసుకోవడానికే సీఎం జిల్లాకు వస్తున్నారా.. లేక బద్వేల్లో నీరు–చెట్టు కింద నామినేషన్‌పై చేసిన రూ.200కోట్ల పనులకు సంబంధించి డబ్బులు కార్యకర్తలకు అందాయో లేదో తెలుసుకోవడానికి వస్తున్నారా.. అని ఎద్దేవా చేశారు. బద్వేల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపు రం, రాయచోటిల్లో టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదుర్చడానికే సీఎం వస్తున్నారే తప్పా ప్రజల కోసం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ కాలనీల్లో ఉచిత విద్యుత్ ఇస్తుంటే, బాబు సీఎం అయ్యాక మీటర్లు బిగించి వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్కు పేరు వస్తుందనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నగర ప్రధా న కార్యదర్శి శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీలో నాలుగు ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవమే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉప ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గడువు ముగిసే సమయానికి నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత వీరి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి డీసీ గోవిందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయగా, గురువారం టీడీపీ అభ్యర్థులు ఎంఏ షరీఫ్, కావలి ప్రతిభా భారతి, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. వీరు రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. షరీఫ్, వీర్రాజు సాధారణ కోటా కింద నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిభా భారతి మాత్రం పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణకు అందచేశారు. ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పేరును ఖరారు చేసినప్పటికీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటరుగా నమోదు కాకపోవడంతో పోటీ చేయడానికి వీలులేకపోవడంతో చివరి నిమిషంలో ప్రతిభా భారతి పేరును ఖరారు చేశారు. షరీఫ్, ప్రతిభా భారతిల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి కె. అచ్చాన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, వేగుల జోగేశ్వరరావు, అరిమిల్లి రాధాకృష్ణ, బోండా ఉమామహేశ్వరరావు, పులపర్తి నారాయణమూర్తి, వర్మ, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్, పార్టీ నేతలు ఏఎం రాధాకృష్ణ, రవియాదవ్, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు షరీఫ్‌తో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారైన టీడీ జనార్ధనరావును పార్టీ నేతలు ఎన్టీఆర్ భవన్లో సత్కరించారు. బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేఎల్పీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు వీర్రాజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవరం వరకూ గడువు ఉంది. అయితే నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయటంతో వారు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం ప్రకటిస్తారు. నామినేషన్ వేసిన సందర్భంగా షరీఫ్, ప్రతిభా భారతి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనేందుకు తమ ఎన్నిక నిదర్శనమన్నారు. షరీఫ్ సుదీర్ఘకాలంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిభా భారతి గతంలో స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. 2004, 2009 సాధారణ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకమారు ఓటమిని చవి చూశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందరెడ్డి
హైదరాబాద్: ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా డీసీ గోవిందరెడ్డి బుధవారం తన నామినేషన్ పత్రాలు అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. ఏపీ ఎమ్మెల్సీ నాలుగు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగున్నాయి. నామినేషన్లు ఉపసంహరణ గడువు ఈ నెల 23తో ముగియనుంది. డీసీ గోవిందరెడ్డి గతంలో రోడ్డు రవాణాశాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించి డీసీ గోవిందరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు మే 14వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంతో శాసనమండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు పెరిగాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అకస్మిక మృతి చెందారు. దాంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. -
నమ్మకానికి పెద్దపీట
డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు సంబరాలు జరుపుకున్న అభిమానులు బద్వేలు(అట్లూరు) : మాజీ ఎమ్మేల్యే డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంతో బద్వేలు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన గోవిందరెడ్డి, లక్షుమ్మ దంపతుల మొదటి సంతానం దేవసాని చిన్న గోవిందరెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబమైనప్పటికి చిన్నప్పటి నుండి గోవిందరెడ్డి చదువులో దిట్ట. డిప్యూటీ ట్రాన్సుపోర్ట్ కమిషనర్‌గా ఉద్యోగం చేస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉండే అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశీస్సులతో 2004లో బద్వేలు ఎమ్మేల్యేగా గెలుపొందారు. తనదైన శైలిలో అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్‌కు సన్నిహితునిగా మెలిగారు. బద్వేలు నియోజకవర్గం 2009లో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆ సీటును కమలమ్మకు కేటాయించారు. గెలుపు భారాన్ని తన భుజస్కందాలపై వేసుకుని కమలమ్మను గెలిపించారు. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డికి మరింత చేరువయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరువీధి జయరాములును గెలిపించుకోవడంలో తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా శనివారం పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. -
ఆస్పత్రి తరలింపుపై కొనసాగుతున్న ఆందోళన
బద్వేల్ అర్బన్(వైఎస్సార్ జిల్లా) : బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తరలించొద్దని ప్రజలు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం జరిగిన ఆందోళనకు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జయరామ్, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు డీసీ.గోవిందరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నాలో ఇద్దరు ఎమ్మెల్యేలూ పాల్గొన్నారు.