
బద్వేల్‌లో టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తోంది.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేల్‌లో టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇస్తోంది. బద్వేల్‌లో చాలాచోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మారారు. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోంది. బీజేపీకి టీడీపీ మద్దతివ్వడంపై టీడీపీ దళిత నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.