
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మహానందిపల్లి, పెండ్లిమర్రి, చెన్నారెడ్డి పల్లి, శంఖవర పంచాయతీల మీదుగా మంగళవారం రోడ్ షో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపఎన్నికల అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, ఎన్నికల ఇన్‌చార్జి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మండల నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment