
కాశినాయన/బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బద్వేలు బీజేపీ అభ్యర్థి పి.సురేష్ ఆదివారం మంతనాలు జరిపారు. వెంకటరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే బీజేపీలో చేరేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది.
బీజేపీ ప్రచార రథాల ప్రారంభం
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ ప్రచార రథాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా గ్రామీణ రహదారులను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశారన్నారు. రాయలసీమ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లు, నాలుగు లేన్ల రహదారులు నిర్మించిందన్నారు. నికర జలాలు ఇచ్చేందుకు కూడా బాధ్యత తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment