
సాక్షి, తాడేపల్లి: బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే గెలిపిస్తాయని తెలిపారు. 98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేశామని, ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి భారీ విజయలు దక్కాయని గుర్తుచేశారు.
కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులాలను తెరపైకి తెచ్చి లబ్ధిపొందే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment