
తాడేపల్లి: టీడీపీ నేతలు బీజేపీకి ఏజెంట్లుగా పనిచేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నామని ఈ గెలుపుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం.. బరిలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని మోసుకొచ్చారని ఆరోపించారు.
ప్రతీ ఎన్నిక మా బాధ్యతను మరింత పెంచుతోందని సజ్జల పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్నారు. పోటీలో లేకపోయినా జనసేన, టీడీపీ ప్రచారం చేశాయని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రలను బద్వేలు ప్రజలు తిప్పికొట్టారన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.