
సాక్షి, తాడేపల్లి: బద్వేలు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేల్ ఉపఎన్నిక విషయంలో ఇప్పటికే వెంకట సుబ్బయ్య భార్య సుధ అభ్యర్థిగా ఉంటారని సీఎం చెప్పారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి టికెట్ ఇవ్వడం మా సంప్రదాయం. సానుభూతిగా మిగిలిన వారు పోటీ ఉండకపోవడం సాంప్రదాయం.
ఒకవేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్‌గా తీసుకోవాలో అలానే తీసుకుంటాం. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదు. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారు. రూ.100 కోట్ల వరకు పంచారు. పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలు మా ప్రభుత్వం గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశం. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం మాకూ అవసరం. మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చు అని సజ్జల అన్నారు. చదవండి: (క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment