సాక్షి, రంగారెడ్డి : ఎన్నికల ప్రచారం జోరు మీదుంది. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అలిసిపోతున్న నాయకులు, కార్యకర్తలు సేద తీరడానికి చల్లని బీరు, మద్యం కోసం వైన్స్‌ల బాటపడుతున్నారు. అభ్యర్థులు సైతం తమ అనుచరులు.. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా మందుతో కూడిన విందులు ఏర్పాటు చేస్తున్నారు.
కేవలం మద్యం మాత్రమే కాకుండా ప్రతిరోజు మాంసాహారం తప్పనిసరి అయింది. దీంతో మార్కెట్‌లో ఇప్పుడు మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్ షాపులు సైతం కళకళలాడుతున్నాయి. దీంతో పనిలో పనిగా వంటలు, కేటరింగ్ చేసే వాళ్లకు మంచి చేతి నిండా పని దొరుకుతోంది.
కడుపు నిండా తిండి..
ఎన్నికల ప్రచారం ప్రారంభంతో హోటళ్ల వద్ద సందడి పెరిగిపోయింది. చాయ్ తాగుతూ బాతాకానీ కొట్టే వారు కొందరైతే.. అభ్యర్థుల వెంట తిరిగి అలిసిపోయిన వారు ఘుమఘుమలాడే బిర్యానీల కోసం హోటళ్ల వైపు పరుగులు పెడుతున్నారు.
అయితే, కొన్ని సందర్భాల్లో హోటళ్లలో బిర్యానీ సైతం దొరకడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో ఇప్పుడు బిర్యానీ దొరకడం కొంత కష్టంగానే మారిందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment