పరిగిలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం
సాక్షి,రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. ముందుగా తాండూరులో సభ నిర్వహించారు. అనంతరం సీఎం పరిగికి చేరుకున్నారు. ఆ తర్వాత షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో సభలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు, జనం భారీగా సభలకు తరలిరావడంతో నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఆద్యంతం గులాబీ దళపతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మధ్యమధ్యలో కేసీఆర్ విసిరిన పంచ్‌లు ఆకట్టుకున్నాయి.
టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభకు ముందు కళాకారుల ఆటాపాటలు ఉత్సాహపరిచాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం సభ సైడ్‌లైట్స్
తాండూరుకు మధ్యాహ్నం 1:10 గంటలకు కేసీఆర్ చేరుకున్నారు.
1:20 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, బీజేపీ, టీడీపీ నాయకులకు కేసీఆర్ టీఆర్‌ఎస్ కండువాలను కప్పి ఆహ్వానించారు.
1:26 గంటల నుంచి 1:57 గంటల వరకు కేసీఆర్ ప్రసంగించారు.
మధ్యాహ్నం 2 గంటలకు సభా స్థలం నుంచి కేసీఆర్ హెలిపాడ్ వద్దకు బయలుదేరారు.
మధ్యాహ్నం 2.10 గంటలకు తాండూరు నుంచి హెలికాప్టర్‌లో పరిగికి వెళ్లారు.
సభలో కేసీఆర్‌తో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు.
సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేసిన జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి.
తాండూరు ప్రాంతానికి చెందిన పర్యాద కృష్ణమూర్తి చిరకాల మిత్రుడన్న కేసీఆర్.
తాండూరులో సభా ప్రాంగణం సరిపోకపోవడంతో జనాలు రోడ్లపై నిలబడి కేసీఆర్ ప్రసంగం ఆసక్తిగా విన్నారు.
ఓ బాలుడు సభలో గులాబీ జెండాతో సందడి చేశాడు.
సభకు వస్తుండగా హెలికాప్టర్‌లోంచి కోట్‌పల్లి ప్రాజెక్టును చూడగా పూర్తిగా ఎండిపోయందని కేసీఆర్ ప్రసంగంలో పేర్కొన్నారు.
తాండూరులో దుమ్ము, ధూళితోపాటు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేసీఆర్ హామీ.
మేడలపై నుంచి కేసీఆర్‌ను చూసిన జనాలు.
ఇబ్రహీంపట్నంలో
ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ సభాస్థలికి చేరుకోకముందే ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తమ ప్రసంగం ముగించారు.
సాయంత్రం 5: 30 గంటలకు సీఎం హెలికాప్టర్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని కొద్దిసేపు చక్కర్లు కొట్టింది.
5:40 గంటలకు హెలిపాడ్‌లో దిగింది. 5:54 గంటలకు సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 30 నిమిషాల పాటు సీఎం ప్రసంగించారు.
కండువా కప్పి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌తోపాటు ఆయన అనుచరులను సీఎం టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
క్యామ మల్లేశ్ పేరును తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించిన సీఎం.
హెలికాప్టర్‌లో వచ్చి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లిన కేసీఆర్.
క్యామ మల్లేశ్‌కు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం ప్రకటించగానే సభలో చప్పట్లు.
Comments
Please login to add a commentAdd a comment