సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే, ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికల కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా కోమటిరెడ్డి అందరికీ షాకిచ్చారు.
కాగా, మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంటకరెడ్డి దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఈనెల 15వ తేదీన కోమటిరెట్టి.. తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల బరిలో కోమటిరెడ్డి సోదరుడు.. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం.
అయితే, మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో.. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారానికి వస్తే హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: మునుగోడులో ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’
Comments
Please login to add a commentAdd a comment