కృష్ణమోహన్‌రెడ్డి ఎక్కడికీ వెళ్లడు
కేటీఆర్ కూడా నా వద్దకు వచ్చి మాట్లాడారు.. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టా?
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే...
ఇష్టాగోష్టిలో మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకోవడానికి తానున్నానని, బీఆర్‌ఎస్‌కు తాను చాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ముగ్గురూ కలిసి రేవంత్‌రెడ్డిని ఓడించలేకపోయారని, ఆయనకు వాళ్లు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎక్కడకూ వెళ్లడని, చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పారీ్టలో చేరినట్టా అని అన్నారు.
మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి విలేకరులతో చిట్‌చాట్ మాట్లాడారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, అంతమాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అవుతుందా అని చెప్పారు. ‘కేసీఆర్ సభకు ఎందుకు రావడంలేదు. సభలో ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్షనేత కూడా అలాగే.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే.
ఆయన వైఖరి చూస్తోంటే త్వరలోనే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది’అని కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తాను చెప్పిన మాటలను జగదీశ్‌రెడ్డి అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పిన కోమటిరెడ్డి.. బీఆర్‌ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్‌కు త్వరలోనే రీటెండర్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment