సాక్షి,రాజేంద్రనగర్: ‘ఏం యాదన్న.. ఈమధ్య రోజూ టిక్..టాక్ తయారైపోతున్నావు. ఏంది సంగతి. ఆ ఏమి లేదు నర్సన్న. కూలీ అయితే రోజూ ఎలాగో అలా... పొయ్యేటొళ్లం. ఇప్పుడు ఎన్నికలు కదా. అందుకే ఉదయమే తానం చేసి, ఇస్త్రీ చేసిన బట్టలు ఏసుకొని ప్రచారానికి పోతున్న. గిట్ల మంచిగ తయారై పోతే నాలుగు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే టిక్.. టాక్‌గా తయారై పోతున్నా.
’ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా బలగం చూపించుకుంటున్నారు. దీంతో నేతలు మహిళలతో పాటు పురుషులను రప్పించుకుంటున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ ప్రాంతాల్లో పని చేస్తే కూలీలను సైతం తమ వెంట తీసుకువెళ్తున్నారు.
నేరుగా వారి వద్దకు వెళ్లకుండా వారి తరఫున ఉన్న కాంట్రాక్టర్లు, ఏజెంట్లు, మేస్త్రీలు వారిని ఆశ్రయిస్తున్నారు. మామూలుగా వెంట తిరిగే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు డబ్బును ఇస్తున్నారు. ఓ మోస్తారు నాయకులుగా కనిపించేందుకు వారిని ప్రతిరోజు నీట్‌గా రెడీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉన్న వారికి ఇతరుల కంటే డబ్బు ముట్టజెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment