సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతికిఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఎన్నికల ప్రచారం నుంచి కొంత సమయం పాటు బ్యాన్ చేసింది. మతపరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగిని మూడు రోజులు (72 గంటల పాటు), మాయావతిని రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారంనుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.
ముఖ్యంగా యోగి, మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రసంగాలనుఉదహరిస్తూ సోమవారం సుప్రీకోర్టు ఈసీపై విమర్శలు గుప్పించింది. ఎంతుకు ఉదాసీనంగా ఉంటున్నారని చురకలంటించింది.
దీంతో రెండవ దశ ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నేతలిద్దరికీభారీ ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూపీ ఎన్నికల బరిలో యోగి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా ఈసీ కట్టడి చేయడం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీఎస్‌పీ, బీజేపీకి పెద్ద షాకే.
Comments
Please login to add a commentAdd a comment