లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి పరాభావం తప్పదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునరావృత్తం అవుతాయని, అధికారం కోసమే అఖిలేష్, మాయావతి జట్టుకట్టారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం యూపీలో జరిగిన బహిరంగ సభలో యోగి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఒక్క సీటు కూడా రాదని, గత ఎన్నికల్లో విజయ సాధించిన ఐదే స్థానాల్లోనే ఎస్పీ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. బీఎస్పీ, ఎస్పీ హయాంలో జరిగిన మత ఘర్షణలపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం వారికి లేదని మండిపడ్డారు. అఖిలేష్‌కు ముజఫర్‌నగర్ అల్లర్ల గురించి చర్చంచే దమ్ముందా అని యోగి సవాల్ విసిరారు.
గడిచిన 55 ఏళ్ల అభివృద్ధి ఏంటో.. తమ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లకాలంలో జరిగిన అభివృద్ధి ఏంటో చూడాలని అన్నారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 23 లక్షల గృహాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని యోగి వెల్లడించారు. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కాగా యూపీలో మహాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ.. ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ పార్టీల నేతలు ఆదివారం భారీ ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదన్న మాయావతి విమర్శలపై యోగి ఈ విధంగా స్పధించారు..
Comments
Please login to add a commentAdd a comment