లక్నో: ‘ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమిలో అఖిలేశ్ యాదవ్‌కు తగిన ప్రాధాన్యమే లేదు. కూటమి అధిపతిగా మొత్తం మాయావతే చక్రం తిప్పుతున్నారు. వేదిక మీద కలిసి కూర్చునే సమయంలోనూ మాయవతికి పెద్ద కూర్చీ వేస్తుండగా అఖిలేశ్‌ను చిన్న కూర్చీలో కూర్చోబెడుతున్నారు. ఇక, మాయావతిని కలిసేందుకు వెళితే.. బూట్లూ విప్పాకే లోపలికి రావాలంటూ అఖిలేశ్‌కు చెప్తున్నారు. ఇది కూటమిలో ఆయన పోజిషన్’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా విరుచుకుపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ చేతులు కలిపి కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కూటమిలో అఖిలేశ్‌కు తగిన పట్టు లేదని, చివరికీ మాయావతిని కలిసేందుకు వెళ్లినా.. ఆయనతో బూట్లు విపిస్తున్నారని తాజాగా ఏఎన్‌ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన యోగి విమర్శించారు. కూటమిలో సీట్ల పంపకాల విషయంలోనూ ఎస్పీ సుప్రీం ములాయంసింగ్ యాదవ్ కూడా అసంతృప్తితో ఉన్న విషయాన్ని యోగి ప్రస్తావించారు. బీఎస్పీ కన్నా ఎస్పీకి ఎక్కువ సీట్లు దక్కాల్సి ఉండేదని, కానీ, సీట్ల పంపకాల్లో తన కొడుకుకు మాయావతి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ములాయం మండిపడుతున్నారని యోగి చెప్పుకొచ్చారు.
అఖిలేశ్‌తో బూట్లు విప్పించారు!
Published Sat, May 4 2019 8:57 AM | Last Updated on Sat, May 4 2019 9:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment