
రొట్టె చేస్తా.. ఓటెయ్యండి
వట్‌పల్లి(అందోల్): రొట్టెలు చేస్తాను నాకు ఓటు వేయాలంటూ బీఎల్‌ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి పి.జయలక్ష్మీ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేశారు. సోమవారం మండల పరిధిలోని కేరూర్ గ్రామంలో ఇంటింట ప్రచారంలో భాగంగా రొట్టెలు చేస్తున్న మహిళ వద్దకు వెళ్లి నేను రొట్టె చేసిస్తాను నాకు ఓటు వేయమ్మ అంటూ అభ్యర్థించారు.
మిర్చి తిని.. మద్దతివ్వండి
మునిపల్లి(అందోల్): టీఆర్‌ఎస్ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి క్రాంతికిరణ్ సతీమణి పద్మిని బుదేరాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌరస్తాలోని ఓ టిఫిన్ బండి వద్ద మిర్చి బజ్జీలను తయారు చేసి సందడి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలని బండి నిర్వాహకుడిని, కస్టమర్లను కోరారు.
ఓట్ల మోత మోగాలె..
జహీరాబాద్ టౌన్: బీజేపీ అభ్యర్థి జంగం గోపి ప్రచారంలో కళాకారులతో పోటీ పడి డప్పు వాయించి ప్రచారాన్ని హోరెత్తించారు. వివిధ రకాల ట్యూన్లు వాయించి అక్కడ ఉన్న వారితో ఔరా అనిపించారు. తనకు ఓటు వేయడం మరిచిపోవద్దని
స్థానికులను కోరారు.
బోనమెత్తిన అభిమానం

సదాశివపేట రూరల్(సంగారెడ్డి): టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు పెద్దాపూర్ మహిళలు ‘జై తెలంగాణ’ అని రాసి ఉన్న బోనాలలతో ఘనంగా స్వాగతం పలికారు. మా ఓటు మీకే అంటూ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment