
తిరువణ్ణామలైలో చిన్నారుల కళలను పరిశీలిస్తున్న కమల్‌హాసన్
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తెలిపారు. మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు. రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చదవండి: రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!
మక్కల్ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!