Kamal hasaan
-
మల్టీస్టారర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కమల్..
-
విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన విలక్షణ నటుడు కమల్ హాసన్
-
వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు
కథను ముందుకు తీసుకెళతాడు కథానాయకుడు (హీరో). ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడుతుంటాడు ప్రతినాయకుడు (విలన్). హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే నాయకులు అప్పుడప్పుడూ ప్రతినాయకులుగా కూడా నటిస్తుంటారు. ఇలా కొందరు కథానాయకులు ‘ప్రతినాయకులు’గా కనిపించడానికి రెడీ అయిన చిత్రాల గురించి తెలుసుకుందాం. మిషన్.. ప్రాజెక్ట్ కె రెండొందలకు పైగా సినిమాల్లో నటించి, ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా కెరీర్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు కమల్‌హాసన్. అలాగే దర్శకులు మణిరత్నం, హెచ్. వినోద్ కథల్లో కథానాయకుడిగా నటించేందుకు కమల్‌హాసన్ ఆల్రెడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇలా హీరోగా వరుస ప్రాజెక్ట్స్‌ను ఆయన లైన్లో పెట్టారు. అయితే కథానాయకుడిగానే కాదు.. కథ నచ్చితే ఆ కథలోని కథానాయకుడికి ప్రతినాయకుడిగా సవాలు విసరడానికి రెడీ అయ్యారు కమల్. ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’లో నటించడానికి కమల్‌హాసన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్రలు చేయడం కమల్‌హాసన్‌కు కొత్తేమీ కాదు. (ఇదీ చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) ‘ఇంద్రుడు–చంద్రుడు’ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్), ‘ఇండియన్’, ‘ఆళవందాన్’ (తెలుగులో ‘అభయ్’), ‘దశావతారం’ వంటి సినిమాల్లో ఆయన హీరోగా, విలన్‌గా నటించి మెప్పించారు. సో.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ నెగటివ్ షేడ్ క్యారెక్టర్లో కమల్ కనిపించినట్లు అవుతుంది. మరి.. ‘ప్రాజెక్ట్ కె’లో కమల్ చేస్తున్నది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరేనా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ వార్‌లో... నాయకుడి పాత్రైనా, ప్రతి నాయకుడి పాత్రైనా ఎన్టీఆర్ అవలీలగా చేసేస్తుంటారు. ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన జై, లవ, కుశ పాత్రల్లో జై విలన్ క్యారెక్టర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’లో చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన హిందీ హిట్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘వార్’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘వార్’లో హీరోగా నటించిన హృతిక్ రోషనే సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రాక్షస రాజు హీరో, విలన్, గెస్ట్ రోల్.. ఇలా ఏ పాత్రలో అయినా రానా అదుర్స్. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు పాత్రలో అద్భుతంగా విలనిజమ్ పండించారు రానా. అలాగే ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరోగా నటించిన రానా క్యారెక్టర్లో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఈ సినిమాకు తేజ దర్శకుడు. కాగా రానా, తేజ కాంబినేషన్లోనే ‘రాక్షస రాజు’ అనే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కనుంది. గోపీనాథ్ ఆచంట నిర్మిస్తారు. టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ టచ్ ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్య కశ్యప’, మిలింద్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో రానా హీరోగా నటిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. కొత్త ఇన్నింగ్స్ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత హీరోగా వెండితెరపై కనిపించలేదు మంచు మనోజ్. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో మనోజ్ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో విశాల్, సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట మనోజ్. రవితేజ హీరోగా ‘కలర్‌ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని, ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్రలో, మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించ నున్నారని టాక్. మరి.. ప్రతినాయకుడి పాత్ర పరంగా మంచు మనోజ్ కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. లంకల రత్న? ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అన్నది విశ్వక్ సేన్ తాజా చిత్రంలోని డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రంలో విశ్వక్ క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా స్టార్టింగ్ సమయంలో మాస్ కా దాస్ బ్యాడ్‌గా మారాడు అంటూ చిత్ర యూనిట్ నుంచి వినిపించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకు ‘లంకల రత్న’ టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ ముగిసినట్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని రిమోట్ లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్ సేన్. వీరే కాదు.. ఒకవైపు నాయకులుగా నటిస్తూ మరోవైపు ప్రతినాయకులుగానూ నటిస్తున్న హీరోలు ఇంకొందరు ఉన్నారు. -
ఫ్యాషన్ అంటే ఇదీ.. వస్త్ర వ్యాపారంలోకి లోకనాయకుడు
Kamal Haasan to launch 'KH House of Khaddar' Business: నటనలో మేరునగధీరుడు కమల్‌హాసన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. భారతీయ ఖద్దరుని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. కేహెచ్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్‌తో ఈ వస్త్రాలు మార్కెట్లోకి తేనున్నారు. బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా రెడీ చేసిన ప్రోమోను ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. కమల్‌తో గుర్తింపు కమల్‌హాసన్ ఖద్దరు దుస్తుల వ్యాపారంలోకి రావడం వల్ల ఖద్దరుకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని. తద్వారా చేనేత కార్మికులకు మేలు జరుగుతుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు ఎఫెక్ట్ ప్రస్తుతం కమల్‌హాసన్ విక్రమ్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఇండియన్ 2 చిత్రానికి మన చిత్తూరుకి చెందిన అమృత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖద్దరు దుస్తులకు డిమాండ్ ఎక్కువ. అమృత ద్వారా ఇండియన్ 2 చిత్రాల్లో ఖద్దరుతో కమల్‌కి అనుబంధం ఎక్కువైంది. ఎన్నికల హామీ మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంచీపురంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కమల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెస్ట్రన్ వరల్డ్‌కి ఖద్దరుని పరిచయం చేయాలని కమల్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా కేహెచ్ బ్రాండ్‌ని తెర మీదకు తీసుకొచ్చారు. ఖద్దరు ఫ్యాషన్ ప్రస్తుతం ఖద్దరు దుస్తులంటే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువ ధరిస్తారనే ముద్ర పడిపోయింది. ఈ ట్రెండ్‌ని కమల్ బ్రేక్ చేసేలా ఉన్నారు. ఖద్దరుతో పూర్తిగా సూటుబూటులో జేమ్స్‌బాండ్ కనిపిస్తూ ప్రమోషన్ ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్ యాడ్ చివర్లో ‘ఫ్యాషన్ ఈజ్ సివిల్, యేట్ డిస్ఒబీడియెంట్’ అంటూ మీసం మెలేశారు. ఇండియన్ యూత్ వెస్ట్రన్ మెన్ టార్గెట్‌గా ఆయన ఖద్దరు తేబోతున్నట్టు తెలుస్తోంది. Our weavers chance to loom large. Dear West, follow the thread it will reach you to our history. Bravo khaddar says KHHK !! https://t.co/qrxpSE72Yq#KHHouseofKhaddar #BravoKhaddar pic.twitter.com/jMSNv6jR3W — Kamal Haasan (@ikamalhaasan) November 16, 2021 చదవండి: ఆ నమ్మకమే.. ఆయన్ని ఈ వయసులోనూ ‘కింగ్’గా నిలబెట్టింది -
నేనే సీఎం అభ్యర్థి: కమల్ హాసన్
సాక్షి, చెన్నై: మూడో కూటమి ఏర్పాటైతే తానే సీఎం అభ్యర్థి అని మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్ అన్నారు. జనవరిలో పొత్తు ప్రకటన ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారానికి తిరుచ్చి నుంచి ఆదివారం కమలహాసన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తిరుచ్చి వెళ్లిన ఆయన అక్కడ సుడిగాలి పర్యటన చేశారు. మహిళా సంఘాలు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు ఇలా అన్ని వర్గాలను కలుసుకున్నారు. సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. సోమవారం కమల్ మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జనవరిలో పొత్తు ప్రకటన.. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షం తదుపరి మూడో పక్షంగా మక్కల్ నీది మయ్యం అవతరించిందని తెలిపారు. ప్రజలు తమను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. జనవరిలో పొత్తు ప్రకటన అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మూడో కూటమి ఏర్పాటైన పక్షంలో ఆ కూటమి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానని పేర్కొన్నారు. రజనీకాంత్ ఆరోగ్యం తనకు ముఖ్యమన్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ద్రవిడ పార్టీయే అని స్పష్టం చేశారు. తమిళం మాట్లాడే వాళ్లందరూ ద్రవిడులేనని అన్నారు. అవసరం అయితే కలైంజర్ కరుణానిధి పేరును కొన్ని చోట్ల ప్రస్తావిస్తా మన్నారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగుతోందన్నారు. దివంగత నేత ఎంజీఆర్ తరహాలో అవినీతి రాయుళ్లపై కొరడా ఝుళిపించేందుకు ఈ పాలకులు సిద్ధమా..? అని ప్రశ్నించారు. ఏఏ పనులకు ఏ మేరకు లంచం ముట్ట చెప్పాల్సి ఉందో ఓ చిట్టాను కమల్ ప్రకటించారు. తనను రెండేళ్ల క్రితమే రోడ్డున పడేయడానికి ఈ పాలకులు ప్రయత్నించారని, వాటన్నింటిని ఎదుర్కొన్న తాను మున్ముందు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు. -
ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తెలిపారు. మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు. రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చదవండి: రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా! మక్కల్ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై! -
బిగ్‌బాస్ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం
-
బిగ్‌బాస్ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తమిళ్ బిగ్‌బాస్-3 అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి కంటెస్టెంట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది ఆనందంతో కంటతడి పెట్టారు. అయితే, నటి, యాంకర్ లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. చాలాకాలం తర్వాత కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి లోనవ్వడానికి బదులు.. కూతురిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్‌లో తోటి కంటెస్టెంట్ అయిన కేవిన్తో లోస్లియా సన్నిహితంగా ఉంటుంది. వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో లోస్లియా తీరు పట్ల ఆమె తండ్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను నిన్ను పెంచిన పద్ధతి ఇదేనా?’ అంటూ కోపం వ్యక్తం చేశారు. లోస్లియా ముందుగా తండ్రిని చూసి ఆనందానికి లోనయింది. అయితే, తండ్రి తనపై కోప్పడుతూ తిడుతుండటంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. మరో కంటెస్టెంట్ చేరన్ లోస్లియా తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం తండ్రిని లోస్లియా హత్తుకొని ఏడ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో లోస్లియా తండ్రి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లోస్లియాకు అండగా నిలుస్తున్న నెటిజన్లు టీవీ చానెల్లో కూతురిని దూషించడం పద్ధతి కాదని అంటున్నారు. ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూ ఇన్నాళ్లు బిగ్‌బాస్ పోటీలో ఉండగలిగినందుకు లోస్లియాను చూసి ఆమె తండ్రి గర్వపడాలి కానీ, ఇలా దూషించడమేమిటని నిలదీస్తున్నారు. లోస్లియా-కేవిన్ మధ్య ప్రేమాయాణం సాగుతున్నట్టు హైలైట్ చేసిన తమిళ్ బిగ్‌బాస్ హోస్ట్ కమల్ హాసన్, కంటెస్టెంట్ చేరన్ తీరును కూడా వారు తప్పుబడుతున్నారు. కన్నీటిపర్యంతమైన లోస్లియా -
విషమంగా కరుణానిధి ఆరోగ్యం
-
కరుణానిధికి ఇన్ఫెక్షన్, జ్వరం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం కరుణానిధి ఇంటిలోనే ఉండి చికిత్స అందిస్తోంది. వయో భారం, అనారోగ్య సమస్యలతో రెండేళ్లుగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. రెండు నెలల క్రితం కరుణ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో ప్రజాసేవకు అంకితమవుతారని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టి 50వ వసంతంలోకి అడుగు పెడుతుండడంతో శుక్రవారం స్వర్ణోత్సవ కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం కరుణ ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. కాగా, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కరుణానిధిని చూసి వెళ్లారు. -
వాళ్లు అడిగితే ఓకే
యాక్టర్‌గా శ్రుతీహాసన్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అక్షర కూడా నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరి కూతుళ్ల కెరీర్ సక్సెస్‌లో తండ్రి కమల్ హాసన్ సలహాలు, సూచనలు ఎంతో కొంత భాగం ఉంటాయనుకోవచ్చు. కానీ, కూతుళ్ల కెరీర్ విషయంలో కమల్ ఎప్పుడూ సలహాలివ్వరట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ–‘‘ కెరీర్ అడ్వైజ్‌ని నేను ఎప్పుడూ ఇష్టపడను. నా పద్దెనిమిదేళ్ల వయసులో యాక్టర్‌గా, అన్నీ నేను తీసుకున్న నిర్ణయాలే. ఎవ్వరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోలేదు. నా కూతుళ్లు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుకుంటాను. మా తల్లిదండ్రులు కూడా అదే చేశారు. వాళ్లు అడిగినప్పుడు మాత్రమే వాళ్లు చేసే పనిని విమర్శిస్తా, హెల్ప్ చేస్తా, సహాయం చేస్తా’’ అని పేర్కొన్నారు. -
తూత్తుకుడిలో బంద్, స్టాలిన్, కమల్ పర్యటన
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సినీనటుడు కమల్‌హాసన్ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లనున్నారు. కాగా తూత్తుకుడి స్టెర్లైట్ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. -
రాహుల్ వాదనకు కమల్ సమర్థన
సాక్షి, చెన్నై : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు కమల్ హాసన్ తప్పుపట్టారు. నోట్ల రద్దును అమలు చేసి ఉండాల్సింది కాదన్న రాహుల్ నిర్ణయాన్ని తాను కొంతవరకూ సమర్ధిస్తానని చెప్పుకొచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం మక్కల్ నీది మయ్యం పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్ నోట్ల రద్దుపై రాహుల్ ప్రకటనను స్వాగతించారు. మరోవైపు తనకు క్రిస్టియన్ మిషనరీల నుంచి నిధులు అందుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. తనకు మిషనరీల నుంచి నిధులు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ వాదన హాస్యాస్పదమని కమల్ అన్నారు. దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, ఇది అవమానకరమని అభివర్ణించారు. కాగా, ‘తాను ప్రధాని అయితే ఎవరైనా నోట్ల రద్దు ఫైలును తనముందు ఉంచితే దాన్ని చెత్తబుట్టలో వేసేవాడి’నని మలేషియాలో భారత సంతతిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం వాటిల్లిందని అన్నారు. -
కొత్త పొత్తు పొడిచేనా: రజనీ, కమల్ చేతులు కలిపితే..
సాక్షి, చెన్నై: తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ-కమల్ కలిసి రంగంలోకి దిగుతారా? ఈ ఇద్దరి మధ్య పొత్తు పొడిచే అవకాశముందా? అంటే ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ, రజనీ, కమల్ కలిసి పోటీచేస్తే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశముందని సీనియర్ జర్నలిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించడానికి డబ్బు, పేరు ప్రఖ్యాతలు సరిపోవని తాజాగా రజనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట నారాయణ్ స్పందిస్తూ 'రజనీ వ్యంగ్యంగా చేసిన ప్రకటన అది. కానీ రజనీ, కమల్ ఇద్దరూ తమ ప్రకటనల ద్వారా క్రియాశీలంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తామని విస్పష్టంగా చెప్పకపోయినా.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉందని ఈ ప్రకటనల ద్వారా చెప్పకనే చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇద్దరు చేతులు కలిపితే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చాలామంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది' అని విశ్లేషించారు. రాజకీయాల్లో రాణించాలంటే.. డబ్బు, పేరు ప్రఖ్యాతలు మాత్రమే సరిపోవని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ముందుండి నడిపించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. -
ఒకే వేదికపై రజనీ,కమల్
సాక్షి,చెన్నై: రాజకీయ అరంగేట్రంపై విస్పష్ట సంకేతాలు పంపిన అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ఆదివారం ఒకే వేదికపై మెరిశారు. శివాజీగణేషన్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, ఇమేజ్ ఒక్కటే సరిపోదని ఇంకా ఏదో అవసరమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమైతేనే వారి ఆదరణ చూరగొంటామన్నారు.తన కన్నా కమల్ హాసన్ కు రాజకీయాల్లో ఎలా జయించవచ్చో బాగా తెలుసన్నారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం కావాలని ఇటీవల తాను కమల్‌ను అడగ్గా ఆయన తనతో వస్తే చెబుతానని చెప్పారన్నారు. ఈ విషయం రెండు నెలల ముందు అడిగి ఉంటే బాగుండేదేమోనని వ్యాఖ్యానించారు. కాగా, శివాజీ గణేషన్ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రారంభించారు. -
కమల్ 'సీఎం' కామెంట్: రజనీ ట్వీట్
సాక్క్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ సినీ నటులు చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తానంటూ ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ ఊరిస్తుండగా.. మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తానంటూ తేల్చిచెప్పారు. అవసరమైతే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రజనీకాంత్ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'స్వచ్ఛతే దైవత్వం' అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన 'స్వచ్ఛతే సేవ' ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశం వెనుక బీజేపీ ప్రోత్సాహం ఉందనే వ్యాఖ్యానాలు వినిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న రజనీ ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ప్రాబల్యం చాటాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న కమల్ హాసన్ బీజేపీయేతర ప్రతిపక్ష రాజకీయ పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నటులు రాజకీయ ప్రవేశం చేస్తే.. అది తమిళనాడు రాజకీయాల్లో మరింత వేడీ రాజేసే అవకాశముంది. I extend my full support to our hon. Prime Minister @narendramodi ji’s #SwachhataHiSeva mission. Cleanliness is godliness. — Rajinikanth (@superstarrajini) 22 September 2017 -
త్వరలో జవాబు దొరుకుతుంది!
కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వ చ్చిన ‘నాయకుడు’ చిత్రాన్ని అంత సులువుగా ఎవరూ మర్చిపోలేరు. ఈ చిత్రం విడుదలై దాదాపు ఇరవై ఎనిమిదేళ్లు అవుతోంది. టైమ్ మ్యాగజైన్ ఆల్ టైమ్ బెస్ట్ 100 మూవీస్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఘనత ఈ చిత్రానిది. అంతటి అద్భుతాన్నిచ్చిన మణిరత్నం, కమల్ మళ్లీ సినిమా చేయలేదు. అయితే త్వరలో వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇటీవల ఓ సందర్భంలో కమల్ మాట్లాడుతూ -‘‘ ‘నాయకుడు’ నా కెరీర్ మీద చాలా ప్రభావం చూపింది. ఎక్కడికెళ్లినా మళ్లీ మణిరత్నం, మీరూ ఎప్పుడు సినిమా చేస్తారు? అని అడుగుతుంటారు. త్వరలోనే ఈ ప్రశ్నకు జవాబు రావచ్చేమో. మణిరత్నం కూడా మా కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అన్నీ కుదిరితే, హిందీ, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ఆ ఒక్కటి అడక్కండి
సినిమా నిరంతర ప్రవాహం. దీని ఆది గురించి చెప్పగలం గాని అంతం అనేది ఉండదు కాబట్టి. ఆ ఊహే అప్రస్తుతం. అయితే అన్ని చలన చిత్రాలే అయినా కొన్ని చిత్రాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటి చరిత్ర తిరగేయకున్నా వాటిలో లివింగ్ లెజెండ్ విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రాలు చాలా ఉంటాయి. వాటి జోలికి వెళ్లవద్దు. ప్రస్తుతం అఖిల భారత కాదు విశ్వ భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మహానటుడి తాజా ప్రయోగం ఉత్తమ విలన్ చిత్రం గురించి తెలుసుకోవాలనుకోని సినీ ప్రియుడే ఉండడేమో. అలాంటి చిత్రం గురించి పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తమ విలన్లో కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఒకటి ఎనిమిదవ శతాబ్దంకు చెందిన పాత్ర మరొకటి 21వ శతాబ్దం సినీ నటుడి పాత్ర అని, ఈ రెండింటిలో ఒకటి కథా నాయకుడు, మరొకటి ప్రతి నాయకుడు పాత్ర లాంటి రకరకాల ప్రచా రం జరుగుతోంది. ఉత్తమ విలన్ చిత్ర కథలో మర్మం ఏమిటి మహాశయా అని దర్శకుడు రమేష్ అరవింద్‌ను నోరు తెరిచి అడిగి ఆ ఒక్కటి అడక్కండి ఇంకేమైనా సరే చెప్పడానికి సిద్ధం అంటున్నారు. సరే ఈ కన్నడ నట, దర్శకుడు ఏం చెబుతారో చూద్దాం... ప్రశ్న: మంచి దర్శకుడై ఉండి కథను, నిర్మాతను చేతిలో ఉంచుకుని కమల్ మిమ్మల్ని చిత్రానికి దర్శకుడిగా ఎంచుకోవడానికి కారణం? జవాబు: ఏమి అనుకోకపోతే కొంచెం గతంలోకి వెళతాను. పున్నగై మన్నన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు దర్శకుడు కె.బాలచందర్ గారు పరిచ యం చేశారు. నీ అనుభవంతో దర్శకత్వం చేయవచ్చుగా అన్నారొకసారాయన. ఆ మాట లు మంత్రంగా పని చేశాయి. అలా దర్శకుడిగా నా తొలి కన్నడ చిత్ర హీరో కమలహాసన్ అ య్యారు. ఆ తరువాత నేనక్కడ నటిస్తూ, దర్శకత్వం చేస్తున్నాను. నా దర్శకత్వ శైలి, టేస్ట్ కమల్‌కు తెలుసు. బహుశా ఈ అవకాశం నాకివ్వడానికి కారణం ఇదే కావచ్చు. ప్రశ్న : ఇక ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పాత్రల విషయానికొద్దాం. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వాటిలో ఒకటి నాయకుడు, మరొకటి ప్రతినాయకుడి పాత్రలు అంతే కదా? జవాబు: అలాంటి ఊహల్ని ప్రేక్షకుల్లో రేకెత్తిం చాలన్న ఉద్దేశమే ఉత్తమవిలన్ టైటిల్ నిర్ణ యం. అది నెరవేరింది. కొందరు ఈ చిత్రంలో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కమలహాసన్ మళ్లీ ఇప్పుడు పునర్జన్మ ఎత్తిన కథాంశం అని అనుకుంటున్నారు. మేమీ చిత్రం విషయంలో సాధ్యమైనంత వరకు సస్పెన్స్‌ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రశ్న: దర్శక శిఖ రం లాంటి కె.బాలచందర్, కె.విశ్వనాథ్, కమల్, లింగుస్వామి (చిత్ర నిర్మాత) లాంటి వారితో పని చేసిన అనుభవం గురించి? జవాబు: వారందరూ నేను గురువుగా భావించే, గర్విం చే దర్శకులు. ఇక ఈ చిత్రా న్ని నిర్మిస్తున్న దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పాలంటే సహ దర్శకుడిగానే చూస్తారు. పూర్తి స్వేచ్ఛనిస్తారు. ప్రశ్న:చిత్రంలో కొత్త నృత్య ప్రక్రియను పరి చయం చేశారట? జవాబు: ఎనిమిదవ శతాబ్దంకు చెందిన నాయకుడు నృత్య కళాకారుడు. అయితే ఆ కాలంలో ఎలాంటి నృత్యం ఉండేదో తెలియదు. కేరళకు చెందిన తొయ్యం, తమిళనాడుకు చెందిన విల్లుపాటు నృత్య కళల్ని కలిపి ఇలాంటి ఒకే నృత్యకళ ఉండి ఉంటుందనే ఒక కల్పనలో కొత్త నృత్య ప్రక్రియను ఉత్తమవిలన్‌లో ప్రవేశపెడుతున్నాం. ఈ నృత్యం చేయడానికి కమలహాసన్ పలు వారాలు ప్రాక్టీస్ చేశారు. ప్రశ్న : చిత్రంలో పాటల్ని కమల్‌నే పాడారట? జవాబు: చిత్రం సందర్భనార్థంతోనే కమల్ పాడాల్సి వచ్చింది. అందువలన చిత్రంలో నటించేవారే పాడితే సహజత్వం ఆపాదిస్తుంది. అందుకే కమల్ పాడాల్సి వచ్చింది. ప్రశ్న: కథా నాయికల గురించి? జవాబు: పూజాకుమార్, పార్వతీనాయర్, పార్వతి మీనన్, ఆండ్రియా, ఊర్వశి ఐదుగురు నాయికలు నటించారు. ప్రశ్న : కమలహాసన్ చిత్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఈ చిత్రంలో? జవాబు: నిజం చెప్పాలంటే నాకీ చిత్రంలో నచ్చింది ఆ సందేశమే. నేను నిద్రకుపక్రమించే ప్రతి రాత్రి దాని గురించే ఆలోచించేవాడిని అలాంటి ఒక మరచిపోలేని సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పనున్నాం.