
కమల్‌హాసన్, అక్షరాహాసన్, శ్రుతీహాసన్
యాక్టర్‌గా శ్రుతీహాసన్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అక్షర కూడా నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరి కూతుళ్ల కెరీర్ సక్సెస్‌లో తండ్రి కమల్ హాసన్ సలహాలు, సూచనలు ఎంతో కొంత భాగం ఉంటాయనుకోవచ్చు. కానీ, కూతుళ్ల కెరీర్ విషయంలో కమల్ ఎప్పుడూ సలహాలివ్వరట. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ–‘‘ కెరీర్ అడ్వైజ్‌ని నేను ఎప్పుడూ ఇష్టపడను. నా పద్దెనిమిదేళ్ల వయసులో యాక్టర్‌గా, అన్నీ నేను తీసుకున్న నిర్ణయాలే. ఎవ్వరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోలేదు. నా కూతుళ్లు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుకుంటాను. మా తల్లిదండ్రులు కూడా అదే చేశారు. వాళ్లు అడిగినప్పుడు మాత్రమే వాళ్లు చేసే పనిని విమర్శిస్తా, హెల్ప్ చేస్తా, సహాయం చేస్తా’’ అని పేర్కొన్నారు.