తమిళ్ బిగ్‌బాస్-3 అత్యంత ఎమోషనల్‌గా సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ ఆత్మీయులను చూసి కంటెస్టెంట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది ఆనందంతో కంటతడి పెట్టారు. అయితే, నటి, యాంకర్ లోస్లియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. చాలాకాలం తర్వాత కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి లోనవ్వడానికి బదులు.. కూతురిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.