త్వరలో జవాబు దొరుకుతుంది! | Kamal Hasaan To Reunite With Mani Ratnam After 25 Years | Sakshi
Sakshi News home page

త్వరలో జవాబు దొరుకుతుంది!

Published Wed, Jun 3 2015 10:54 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

త్వరలో జవాబు దొరుకుతుంది!

త్వరలో జవాబు దొరుకుతుంది!

 కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వ చ్చిన ‘నాయకుడు’ చిత్రాన్ని అంత సులువుగా ఎవరూ మర్చిపోలేరు. ఈ చిత్రం విడుదలై దాదాపు ఇరవై ఎనిమిదేళ్లు అవుతోంది. టైమ్ మ్యాగజైన్ ఆల్ టైమ్ బెస్ట్ 100 మూవీస్ జాబితాలో చోటు సంపాదించుకున్న ఘనత ఈ చిత్రానిది. అంతటి అద్భుతాన్నిచ్చిన మణిరత్నం, కమల్ మళ్లీ సినిమా చేయలేదు. అయితే త్వరలో వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇటీవల ఓ సందర్భంలో కమల్ మాట్లాడుతూ -‘‘ ‘నాయకుడు’ నా కెరీర్ మీద చాలా ప్రభావం చూపింది. ఎక్కడికెళ్లినా మళ్లీ మణిరత్నం, మీరూ ఎప్పుడు సినిమా చేస్తారు? అని అడుగుతుంటారు. త్వరలోనే ఈ ప్రశ్నకు జవాబు రావచ్చేమో. మణిరత్నం కూడా మా కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అన్నీ కుదిరితే, హిందీ, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement