ఆ ఒక్కటి అడక్కండి
సినిమా నిరంతర ప్రవాహం. దీని ఆది గురించి చెప్పగలం గాని అంతం అనేది ఉండదు కాబట్టి. ఆ ఊహే అప్రస్తుతం. అయితే అన్ని చలన చిత్రాలే అయినా కొన్ని చిత్రాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటి చరిత్ర తిరగేయకున్నా వాటిలో లివింగ్ లెజెండ్ విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రాలు చాలా ఉంటాయి. వాటి జోలికి వెళ్లవద్దు. ప్రస్తుతం అఖిల భారత కాదు విశ్వ భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మహానటుడి తాజా ప్రయోగం ఉత్తమ విలన్ చిత్రం గురించి తెలుసుకోవాలనుకోని సినీ ప్రియుడే ఉండడేమో. అలాంటి చిత్రం గురించి పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది.
ఉత్తమ విలన్‌లో కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని అందులో ఒకటి ఎనిమిదవ శతాబ్దంకు చెందిన పాత్ర మరొకటి 21వ శతాబ్దం సినీ నటుడి పాత్ర అని, ఈ రెండింటిలో ఒకటి కథా నాయకుడు, మరొకటి ప్రతి నాయకుడు పాత్ర లాంటి రకరకాల ప్రచా రం జరుగుతోంది. ఉత్తమ విలన్ చిత్ర కథలో మర్మం ఏమిటి మహాశయా అని దర్శకుడు రమేష్ అరవింద్‌ను నోరు తెరిచి అడిగి ఆ ఒక్కటి అడక్కండి ఇంకేమైనా సరే చెప్పడానికి సిద్ధం అంటున్నారు. సరే ఈ కన్నడ నట, దర్శకుడు ఏం చెబుతారో చూద్దాం...
ప్రశ్న: మంచి దర్శకుడై ఉండి కథను, నిర్మాతను చేతిలో ఉంచుకుని కమల్ మిమ్మల్ని చిత్రానికి దర్శకుడిగా ఎంచుకోవడానికి కారణం?
జవాబు: ఏమి అనుకోకపోతే కొంచెం గతంలోకి వెళతాను. పున్నగై మన్నన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు దర్శకుడు కె.బాలచందర్ గారు పరిచ యం చేశారు. నీ అనుభవంతో దర్శకత్వం చేయవచ్చుగా అన్నారొకసారాయన. ఆ మాట లు మంత్రంగా పని చేశాయి. అలా దర్శకుడిగా నా తొలి కన్నడ చిత్ర హీరో కమలహాసన్ అ య్యారు. ఆ తరువాత నేనక్కడ నటిస్తూ, దర్శకత్వం చేస్తున్నాను. నా దర్శకత్వ శైలి, టేస్ట్ కమల్‌కు తెలుసు. బహుశా ఈ అవకాశం నాకివ్వడానికి కారణం ఇదే కావచ్చు.
ప్రశ్న : ఇక ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ పాత్రల విషయానికొద్దాం. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వాటిలో ఒకటి నాయకుడు, మరొకటి ప్రతినాయకుడి పాత్రలు అంతే కదా?
జవాబు: అలాంటి ఊహల్ని ప్రేక్షకుల్లో రేకెత్తిం చాలన్న ఉద్దేశమే ఉత్తమవిలన్ టైటిల్ నిర్ణ యం. అది నెరవేరింది. కొందరు ఈ చిత్రంలో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కమలహాసన్ మళ్లీ ఇప్పుడు పునర్‌జన్మ ఎత్తిన కథాంశం అని అనుకుంటున్నారు. మేమీ చిత్రం విషయంలో సాధ్యమైనంత వరకు సస్పెన్స్‌ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం.
ప్రశ్న: దర్శక శిఖ రం లాంటి కె.బాలచందర్, కె.విశ్వనాథ్, కమల్, లింగుస్వామి (చిత్ర నిర్మాత) లాంటి వారితో పని చేసిన అనుభవం గురించి?
జవాబు: వారందరూ నేను గురువుగా భావించే, గర్విం చే దర్శకులు. ఇక ఈ చిత్రా న్ని నిర్మిస్తున్న దర్శకుడు లింగుస్వామి గురించి చెప్పాలంటే సహ దర్శకుడిగానే చూస్తారు. పూర్తి స్వేచ్ఛనిస్తారు.
ప్రశ్న:చిత్రంలో కొత్త నృత్య ప్రక్రియను పరి చయం చేశారట?
జవాబు: ఎనిమిదవ శతాబ్దంకు చెందిన నాయకుడు నృత్య కళాకారుడు. అయితే ఆ కాలంలో ఎలాంటి నృత్యం ఉండేదో తెలియదు. కేరళకు చెందిన తొయ్యం, తమిళనాడుకు చెందిన విల్లుపాటు నృత్య కళల్ని కలిపి ఇలాంటి ఒకే నృత్యకళ ఉండి ఉంటుందనే ఒక కల్పనలో కొత్త నృత్య ప్రక్రియను ఉత్తమవిలన్‌లో ప్రవేశపెడుతున్నాం. ఈ నృత్యం చేయడానికి కమలహాసన్ పలు వారాలు ప్రాక్టీస్ చేశారు.
ప్రశ్న : చిత్రంలో పాటల్ని కమల్‌నే పాడారట?
జవాబు: చిత్రం సందర్భనార్థంతోనే కమల్ పాడాల్సి వచ్చింది. అందువలన చిత్రంలో నటించేవారే పాడితే సహజత్వం ఆపాదిస్తుంది. అందుకే కమల్ పాడాల్సి వచ్చింది.
ప్రశ్న: కథా నాయికల గురించి?
జవాబు: పూజాకుమార్, పార్వతీనాయర్, పార్వతి మీనన్, ఆండ్రియా, ఊర్వశి ఐదుగురు నాయికలు నటించారు.
ప్రశ్న : కమలహాసన్ చిత్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఈ చిత్రంలో?
జవాబు: నిజం చెప్పాలంటే నాకీ చిత్రంలో నచ్చింది ఆ సందేశమే. నేను నిద్రకుపక్రమించే ప్రతి రాత్రి దాని గురించే ఆలోచించేవాడిని అలాంటి ఒక మరచిపోలేని సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పనున్నాం.